జీవన శైలి రోజు రోజుకు మారుతూ ఉంది. ఇలా మారడం మూలంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం చాలా మందిని పట్టి పీడిస్తున్న సమస్య అధిక బరువు. ప్రధానంగా అధిక బరువు, ఒబేసిటీ అనేది ప్రస్తుతం ఈ సమస్యలు చాలా కామన్ గా వినిపిస్తున్నాయి. పదేళ్లుగా వార్తల్లో విహారం చేస్తోంది ఒబేసిటీ సమస్య. రెగ్యులర్ డైట్‌లో ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం వ్యాయామం చేయకపోవడం కారణంగా చాలా మంది ఒబేసిటీ బారిన పడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు పరిగణిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : లక్ష్మి ప్రణతికి ఆ ఒక్క కోరిక ఉందట.. కానీ ఎన్టీఆర్ అడ్డు చెప్పడంతో.. చివరికి..!!
Advertisement
చాలా మంది అధిక బరువు ఉన్న వారు బరువు తగ్గించుకోవడం కోసం రాత్రి పూట అన్నం బదులు చపాతీలు, జొన్న, రాగీ రొట్టెలు తింటున్నారు. ఎక్కువగా కొందరూ చపాతీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నం బదులు చపాతీలను తినడం వల్ల బరువు తగ్గుతారా.. అసలు చపాతీలను ఎలా తింటే మంచిది. అనే వివరాలను తెలుసుకుందాం.
ఇవి కూడా చదవండి : తన మొదటి హీరోయిన్ ను కలిసిన అల్లు అర్జున్..!
Advertisement
చపాతీలను తయారు చేసే గోధుమపిండిలో విటమిన్ బీ, ఇ, కాల్షియం, ఐరన్, జింక్, సోడియం, పోటాషియం, మెగ్నిషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అన్నం తినడం వల్ల శక్తి లభిస్తుందో చపాతీల వల్ల కూడా అంతే ఎనర్జీ లభిస్తుంది. కానీ అన్నం కంటే చపాతీ త్వరగా జీర్ణం అవుతుంది. చపాతీలను నూనె లేకుండా లేదంటే తక్కువ నూనె వేసి కాల్చడం వల్ల అన్నంలో పోల్చినప్పుడు కాస్త తక్కువ క్యాలరీలు ఉంటాయి. అంతేకాదు.. రెండు, మూడు చపాతీలు తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకుంటాం. ఫలితంగా త్వరగా బరువు తగ్గుతాం అంటున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి : ముంబై విధుల్లో బైక్ పై విరుష్క..!
బరువు తగ్గాలనుకునేవారు రాత్రి 7 గంటలలోపు చపాతీలను తినడం బెటర్ అంటున్నారు. చపాతీలు తినడం వల్ల కేవలం బరువు తగ్గడానికి మాత్రమే ఇతర ప్రయోజనాలున్నాయి అంటున్నారు. గోధుమల్లో అధికంగా ఉండే విటమిన్ ఇ, జుట్టును చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. చపాతీలను తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది అని నిపుణులు పేర్కొంటున్నారు. రాత్రిపూట భోజనంలో భాగంగా చపాతీలను తీసుకోవడం వల్ల బరువును తగ్గడంతో పాటు మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
ఇవి కూడా చదవండి : ఇడియట్ సినిమాని “పవన్, మహేష్” ఆ ఒక్క కారణంతోనే రిజెక్ట్ చేసారా ? ఏంటా కారణం ?