Home » ఇడియట్ సినిమాని “పవన్, మహేష్” ఆ ఒక్క కారణంతోనే రిజెక్ట్ చేసారా ? ఏంటా కారణం ?

ఇడియట్ సినిమాని “పవన్, మహేష్” ఆ ఒక్క కారణంతోనే రిజెక్ట్ చేసారా ? ఏంటా కారణం ?

by AJAY
Ad

టాలీవుడ్ లో పూరీజ‌గ‌న్నాత్ కు క్రేజీ డైరెక్ట‌ర్ అనే బిరుదు ఉంది. చాలా మంది డైరెక్ట‌ర్ లు సంవ‌త్స‌రాలు త‌ర‌ప‌డి సినిమాలు చేస్తే అది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో చెప్ప‌లేం. కానీ పూరీ మాత్రం నెల‌ల వ్య‌వ‌ధిలోనే సినిమాల‌ను పూర్తి చేసి విడుద‌ల చేస్తుంటాడు. క‌థ రాయ‌డానికి కూడా ఎక్కువ కాలం ప‌ట్ట‌దు. అలా కూర్చున్నాడంటే ఇలా క‌థ రాసేస్తాడు. పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో ఇడియ‌ట్ సినిమా కూడా ఒక‌టి.

Advertisement

ఈ సినిమాలో ర‌వితేజ హీరోగా న‌టించారు. క‌మిష‌న‌ర్ కూతుళ్ల‌కు మొగుళ్లు రారా అంటూ సినిమాలో ర‌వితేజ చేసే సీన్లు వేరే లెవ‌ల్ లో ఉంటాయి. ఏకంగా క‌మిష‌నర్ కూతురినే ప్రేమించ‌డం ఆ త‌ర‌వాత క‌మిష‌న‌ర్ కు చుక్క‌లు చూపిస్తాడు. అంతే కాకుండా హీరోయిన్ వెంట‌ప‌డే సీన్ లు కూడా ఆక‌ట్టుకునే విధంగా ఉంటాయి.

Advertisement

ఇదే సినిమాను పూరిజ‌గ‌న్నాత్ క‌న్న‌డ‌లో పునీత్ రాజ్ కుమార్ తో తెర‌కెక్కించాడు. పూరీజ‌గ‌న్నాత్ జ‌గ‌ప‌తిబాబుతో తెర‌కెక్కించిన బాచీ సినిమా క‌న్న‌డ‌నాట మంచి విజ‌యం సాధించింది. దాంతో పునీత్ తండ్రి రాజ్ కుమార్ పూరీ జ‌గ‌న్నాత్ ను పిలిపించుకుని పునీత్ ను ప‌రిచ‌యం చేసే బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దాంతో పూరీ పునీత్ హీరోగా అప్పు అనే చిత్రాన్ని తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ ను ఇచ్చారు.

ఇక్క‌డ ర‌వితేజ తో తెర‌కెక్కించి రవితేజ‌ను కూడా స్టార్ ను చేశాడు. ఇడియ‌ట్ క్యారెక్ట‌ర్ ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చేసింది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమా క‌థ‌ను మొద‌ట పూరిజ‌గన్నాత్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వినిపించారు.కానీ ప‌వ‌న్ కల్యాణ్ క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో సినిమాను రిజెక్ట్ చేశారు. అంతే కాకుండా మ‌హేశ్ బాబుకు కూడా ఇడియ‌ట్ క‌థ‌ను వినిపించారు. కానీ డేట్స్ స‌ర్దుబాటు కాని కార‌ణంగా మ‌హేశ్ బాబు కూడా సినిమాను రిజెక్ట్ చేశారు.

ALSO READ :  ఎన్టీఆర్ “నర్తనశాల” సినిమా కోసం తీసుకున్న నిర్ణయాన్ని చూసి నిర్మాతలు సైతం కంగు తిన్నారు !

Visitors Are Also Reading