Home » మ‌ష్రూమ్స్ ఎక్కువ‌గా తింటున్నారా..? ఈ విష‌యాలు మీరు త‌ప్ప‌క తెలుసుకోండి..!

మ‌ష్రూమ్స్ ఎక్కువ‌గా తింటున్నారా..? ఈ విష‌యాలు మీరు త‌ప్ప‌క తెలుసుకోండి..!

by Anji
Ad

సాధార‌ణంగా నాన్ వెజ్ ఇష్ట‌ప‌డ‌ని వారు మ‌ష్రూమ్స్ తిన‌డానికి ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తుంటారు. మ‌ష్రూమ్స్ లో మ‌న ఆరోగ్యానికి అవ‌స‌ర‌మైన ఎన్నో పోష‌కాలు దాగి ఉన్నాయి. మ‌ష్రూమ్‌లో యాండి ఆక్సిడెంట్స్ ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల రోగాల బారి నుంచి మ‌న‌ల్ని కాపాడుతాయి. ప్ర‌స్తుత కాలంలో మ‌ష్రూమ్ వినియోగం ఎక్కువ‌గా ఉంటుంది. ఏవిధ‌మైన ఆహార ప‌దార్థాలు అయిన మితంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి చాలా ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. అలాకాకుండా అమితంగా తీసుకున్న‌ట్ట‌యితే ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

ఇవి కూడా చ‌ద‌వండి :  ప్రాణ స్నేహితులైన ఎన్టీఆర్-దాస‌రి శ‌త్రువులు కావ‌డానికి కార‌ణం ఎవ‌రో తెలుసా..?

Advertisement

మ‌ష్రూమ్స్ ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే వారు అధికంగా వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు అని వైద్యులు సూచిస్తున్నారు. మార్కెట్ లో ప్ర‌స్తుతం ప‌లు ర‌కాల పుట్ట‌గొడుగులు ల‌భిస్తున్నాయి. వాటిలో చాలా ర‌కాల పుట్ట‌గొడుగులు ఆరోగ్యానికి హాని క‌లిగిస్తాయి. అటువంటి వాటిని తిన‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. జీర్ణాశ‌యం స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి మ‌ష్రూమ్స్ ఎక్కువ‌గా తిన‌డం ద్వారా అజీర్తి క‌డుపునొప్పి వాంతులు విరేచ‌నాలు వంటివి వ‌చ్చే ప్ర‌మాదముంది. జీర్ణ‌క్రియ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు మ‌ష్రూమ్ త‌క్కువ‌గా తీసుకోవ‌డం చాలా ఉత్త‌మం.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  పెరుగులో ఇది క‌లుపుకుని తింటే లాభాలెన్నో.. దాని గురించి తెలిస్తే మాత్రం ఇక వ‌ద‌ల‌రు..!


ముఖ్యంగా చాలా మంది అల‌ర్జీ స‌మ‌స్య‌తో ఇబ్బందిప‌డుతుంటారు. అటువంటి వారు మ‌ష్రూమ్ ఎక్కువ‌గా తిన‌డంతో చ‌ర్మంపై ద‌ద్దుర్లు, దుర‌ద వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది. సాధార‌ణంగా కొంత‌మందికి మ‌ష్రూమ్ తిన్న త‌రువాత నీర‌సంగా అనిపిస్తుంది. అటువంటి వారు మ‌ష్రూమ్స్ తీసుకోక‌పోవ‌డం మంచిది. ప్ర‌ధానంగా గ‌ర్భ‌వ‌తిగా ఉన్న వారు వీటిని తిన‌క‌పోవ‌డం చాలా బెట‌ర్‌. ప్ర‌స్తుతం మ‌ష్రూమ్స్ ని కూడా నాచుర‌ల్ ప‌ద్ద‌తిలో కాకుండా అనేక ర‌కాల ర‌సాయ‌నాల‌ను ఉప‌యోగించి పండిస్తున్నారు. గ‌ర్భ‌వ‌తి ఉన్న స‌మ‌యంలో మ‌ష్రూమ్ ఎక్కువగా తిన‌డం ద్వారా త‌ల్లి బిడ్డ ఆరోగ్యం మీద ప్ర‌భావం చూపుతాయి. కాబ‌ట్టి వారు తిన‌క‌పోవ‌డం శ్రేయస్క‌రం.

ఇవి కూడా చ‌ద‌వండి :  ఎంత సంపాదించినా మిమ్మ‌ల్ని ద‌రిద్రం వెంటాడుతుందా..? అయితే ఈ 3 అల‌వాట్లు త‌ప్ప‌క మానుకోండి..!

Visitors Are Also Reading