Home » నిహారిక కారణంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ కోరిక తీర్చుకోలేకపోతున్నారా ?

నిహారిక కారణంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ కోరిక తీర్చుకోలేకపోతున్నారా ?

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు ప్రేమికులు పెళ్లిలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి జూన్ 09న కుటుంబసభ్యులు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ దాదాపు ఆరు సంవత్సరాల నుంచి సీక్రెట్ గా రిలేషన్ మెయింటైన్ చేస్తూ వారి ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పారట. వీరి ప్రేమను అంగీకరించి పెళ్లికి ఒప్పుకోవడానికీ మెగా అభిమానులకు కొద్ది రోజుల సమయం పట్టింది. అంతేకాదు.. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉండాలని మెగా ఫ్యామిలీ కండిషన్స్ పెట్టిందంటూ ఇప్పటికే వార్తలు వినిపించాయి.

Advertisement

ఈ విషయం పక్కన పెడితే తాజాగా తమ కోరికను నిహారిక కారణంగా తీర్చుకోలేకపోతున్నారంటూ ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ తమ పెళ్లిని చాలా గ్రాండ్ గా రాజస్థాన్ లోని భోజ్ పురిలో పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు అందరి సమక్షంలో చాలా వైభవంగా పెళ్లి చేసుకోవాలని భావించారట. కానీ నిహారిక కారణంగా తమ పెళ్లిని అక్కడ చేసుకోవాలి అనే ఆలోచనని విరమించుకున్నారట.

Advertisement

దానికి కూడా ఓ బలమైన కారణమే ఉంది. ఇప్పటికే అక్కడ నిహారిక పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోబోతుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మెగా ఫ్యామిలీ మనకు రాజస్థాన్ లో పెళ్లి అంతగా కలిసి రాలేదు అని భావించిందట. దీంతో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రాజస్థాన్ లో పెళ్లి చేసుకునే ఆలోచనను విరమించుకున్నారట. అందుకే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి హైదరాబాద్ లోని ఫలక్ నుమా  ప్యాలెస్ లో తమ పెళ్లిని గ్రాండ్ గా జరుపుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జేష్ట మాసం కావడంతో జేష్టపుత్రుడు అయిన వరుణ్ తేజ్ పెళ్లి జేష్టమాసంలో జరుగదు. కాబట్టి  వీరి పెళ్లి శ్రావణ మాసంలో జరుగబోతున్నట్టు తెలుస్తోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ గురించి వేణుస్వామి ఆసక్తికర కామెంట్స్..!

మహేష్ బాబు రాజమౌళి సినిమా పై కీలక అప్డేట్…ఫ్యాన్స్ కు పూనకాలే…!

Chanakya Niti : ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని ఇంటి దరిదాపులకు కూడా రానివ్వకండి..!

 

Visitors Are Also Reading