Home » మహేష్ బాబు రాజమౌళి సినిమా పై కీలక అప్డేట్…ఫ్యాన్స్ కు పూనకాలే…!

మహేష్ బాబు రాజమౌళి సినిమా పై కీలక అప్డేట్…ఫ్యాన్స్ కు పూనకాలే…!

by AJAY
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా శ్రీ లీల, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పోస్టర్ లో మహేష్ బాబు మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబు కోసం పవర్ ఫుల్ కథను రాసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం పాన్ వరల్డ్ లెవెల్ లో విడుదల కాబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

rajamouli

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను రాజమౌళి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి ప్రీ విజువలైజేషన్… ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా రాజమౌళి మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇక వీటితో పాటు ఈ సినిమా షూటింగ్ 2024లో ప్రారంభిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గనక సూపర్ హిట్ అయితే మహేష్ బాబు క్రేజ్ పాన్ ఇండియా లెవల్ లో పెరిగిపోతుంది.

Visitors Are Also Reading