Home » యాంటీ ఫ్యాన్స్ తో పెద్ద పెద్ద సినిమాలకు నష్టం వాటిల్లుతోందా..!!

యాంటీ ఫ్యాన్స్ తో పెద్ద పెద్ద సినిమాలకు నష్టం వాటిల్లుతోందా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యాయి అంటే ఆ ఫలితాన్ని చెప్పడానికి కొంత సమయం పట్టేది. కానీ ప్రస్తుతం సినిమా విడుదల అయిందంటే దాని ఫలితాన్ని హిట్టు లేదంటే ఫట్టు అని మాత్రమే తేల్చేస్తున్నారు. దీనికంతటికీ కారణం ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా అని చెప్పవచ్చు. కానీ గతంలో సినిమాలు వస్తే అది చూసిన తర్వాత అభిమానుల నుంచి వచ్చనటువంటి స్పందన ఆధారంగా సినిమా హిట్ అయిందా లేదా ఫ్లాప్ అయిందా అనేది తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ కు ముందే ఆ మూవీ ఫలితాన్ని సోషల్ మీడియాలో ఫస్ట్ రివ్యూ, లేదంటే ఓవర్సీస్ రివ్యూ అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ సోషల్ మీడియా నుండి ఒక మూవీ బయటపడాలంటే మంచి కథ మరియు కథనం ఉండి ఎవరు కామెంట్స్ చేయలేని విధంగా డైరెక్టర్ దర్శకత్వం ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. కానీ మూవీ కి ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా దానిలోని మైనస్ పాయింట్ అన్ని చూపి మరీ ఈ సోషల్ మీడియా వేదికగా పరువు తీస్తున్నారు. ముఖ్యంగా ఒక హీరో మూవీ వస్తే ఆ హీరోకు యాంటీగా ఉన్నటువంటి అభిమానులు ఎలాగైనా సినిమాను ఫ్లాప్ చేయాలని కంకణం కట్టుకొని కూర్చుంటారు. సినిమాకు సంబంధించి ఏ మాత్రం నెగెటివ్ పాయింట్స్ లేకపోయినా ఏదో ఒకటి పెడుతూ రాక్షసానందం పొందుతారు. ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న రచ్చ ఇదే.హీరోలు మాత్రం కలిసిమెలిసి ఉంటే ఫ్యాన్స్ మాత్రం ఇలా చేస్తూ ఫలితాలను తారుమారు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా రాధేశ్యాం, ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల విషయంలో జరిగింది అని చెప్పవచ్చు. మా హీరో సినిమా హిట్ అవ్వలేదు. అలాంటి సమయంలో మీ హీరో కూడా హిట్టు కాకూడదని అది మనసులో పెట్టుకొని కొన్ని వర్గాల వారు ఇలా చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. అదే ఫ్యాన్స్ అందరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మెదలాలని నిర్మాతలు కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తే మీరు ఇలా బ్యాడ్ కామెంట్స్ ద్వారా సినిమాకి వైరం చేయడం కరెక్ట్ కాదని కొంతమంది సినిమా నిపుణులు అంటున్నారు.

Advertisement

ALSO READ;

Advertisement

ల్యాప్‌టాప్ చార్జింగ్ త్వ‌ర‌గా అయిపోతుందా..? అయితే ఈ టిప్స్ పాటించండి..!

భీమ్లానాయక్ రికార్డ్ బ్రేక్ చేయడం మహేష్ వల్ల కూడా కాలేదా..!!

 

 

Visitors Are Also Reading