Home » ల్యాప్‌టాప్ చార్జింగ్ త్వ‌ర‌గా అయిపోతుందా..? అయితే ఈ టిప్స్ పాటించండి..!

ల్యాప్‌టాప్ చార్జింగ్ త్వ‌ర‌గా అయిపోతుందా..? అయితే ఈ టిప్స్ పాటించండి..!

by Anji
Ad

ల్యాప్‌టాప్ ల‌ను ప్ర‌స్తుతం చాలా మంది వినియోగిస్తున్నారు. ఇక క‌రోనా స‌మ‌యం నుంచి ఎక్కువ‌గా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అయిన త‌రువాత వీటి వినియోగం ఎక్కువ అయిపోయింది. ఆఫీస్ నుంచి ప‌ని చేసినా.. ఆన్‌లైన్ క్లాస్‌లు అయినా ఎక్కువ‌గా ఉప‌యోగించేది ల్యాప్టాప్‌ల‌నే. సినిమాలు, గేమ్స్‌కు లాంటి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు కూడా ల్యాప్‌లు బెస్ట్ ఆప్ష‌న్‌గా ఉన్నాయి. ఇలా ల్యాప్‌టాప్‌లో ఏ ప‌ని చేసుకోవాల‌న్నా బ్యాట‌రీ లైఫ్ చాలా కీల‌కం. అందుకే కొన్ని టిప్స్ పాటించ‌డం సాధార‌ణం కంటే మీ ల్యాప్‌టాప్ బ్యాట‌రీ లైఫ్ పెరుగుతుంది. ఎక్కువ సేపు చార్జింగ్ పెట్ట‌కుండానే వాడుకోవ‌చ్చు. మీ ల్యాప్‌టాప్ బ్యాట‌రీ లైఫ్ మెరుగ‌య్యేందుకు పాటించాల్సిన టిప్స్ ఇవే.

Advertisement

డిమ్ స్క్రీన్

ల్యాప్‌టాప్‌లో ఎక్కువ‌గా బ్యాట‌రీని వాడుకునే భాగం స్క్రీన్‌. ఫుల్ బ్రైట్‌నెస్ పెడితే చార్జింగ్ త్వ‌ర‌గా అయిపోతుంది. అందుకే బ్యాట‌రీ ఎక్కువ సేపు ఉండాల‌నుకున్న‌ప్పుడు స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను త‌గ్గించండి. దీని ద్వారా చార్జింగ్ చాలా వ‌ర‌కు సేవ్ అవుతుంది.

ప‌వ‌ర్ సెట్టింగ్స్‌ను మార్చండి

చార్జింగ్ ఎక్కువ సేపు వ‌చ్చేవిధంగా విండోస్ 10లో ప‌వ‌ర్ సేవింగ్ సెట్టింగ్స్ బాగా ఉప‌యోగ‌ప‌డుతాయి. స్టార్ట్ సెర్చ్‌బార్‌లో ప‌వ‌ర్ సేవ‌ర్ అని టైప్ చేస్తే ప‌వ‌ర్ ఆప్ష‌న్ క‌నిపిస్తాయి. మానిట‌ర్ ప‌వ‌రింగ్ ఆఫ్‌, స్లీప్ మోడ్‌కు త్వ‌ర‌గా వెళ్ల‌డం లాంటి ఆప్ష‌న్లు ఉంటాయి. అదేవిధంగా టాస్క్‌బార్ లోని బ్యాట‌రీని ఐకాన్ పై క్లిక్ చేసి ప‌వ‌ర్ అని టైప్ చేయ‌డంతో ఆప్స‌న్స్ క‌నిపిస్తాయి. మానిట‌ర్ ప‌వ‌రింగ్ ఆఫ్‌, స్లీప్ మోడ్‌కు త్వ‌ర‌గా వెళ్ల‌డం లాంటి ఆప్ష‌న్లుంటాయి. అదేవిధంగా టాస్క్‌బార్‌లోని బ్యాట‌రీ ఐకాన్ పై క్లిక్ చేసి కూడా ప‌వ‌ర్ సెట్టింగ్స్‌ను మార్చుకోవ‌చ్చు.

క‌నెక్టివిటీ ఆప్ష‌న్లు ఆఫ్ చేయ‌డం

Advertisement

వైర్‌లెస్ నెట్‌వ‌ర్క్ ఫీచ‌ర్లు కూడా ల్యాప్‌టాప్ బ్యాట‌రీని ఎక్కువ‌గా వినియోగించుకుంటాయి. అందుకే అవ‌స‌రం లేని స‌మ‌యాల్లో వైఫై ఆఫ్ చేయాలి. అదేవిధంగా వినియోగించ‌న‌ప్పుడు బ్లూటూత్‌ను బంద్ చేయాలి.

అన్‌ప్ల‌గ్ చేయండి


చాలా మంది ల్యాప్‌టాప్ ల‌కు మౌస్, ఎక్స్‌ట‌ర్న‌ల్ కీ బోర్డులు వాడుతుంటారు. ఎక్స్‌ట‌ర్న‌ల్ హార్డ్ డ్రైవ్‌లు, వెబ్‌క్యామ్ వినియోగిస్తుంటారు. అవ‌స‌ర‌మైపోయాక వాటిని తీసేయాలి. ముఖ్యంగా ఎక్స్‌ట‌ర్న‌ల్ హార్డ్‌డ్రైవ్‌లు యూఎస్‌బీలు లాంటివి డేటా ట్రాన్స్‌ఫ‌ర్ అయిన వెంట‌నే తీసేయాలి. లేక‌పోతే అవి కూడా ప‌వ‌ర్‌ను వినియోగించుకుంటాయి. డిస్క్ డ్రైవ్ ఉంటే.. దానిలో డిస్క్‌ను తొల‌గించాలి.

చార్జింగ్


ల్యాప్‌టాప్ పూర్తిగా బ్యాట‌రీ అయిపోయే ముందే చార్జింగ్ పెట్టాలి. వీలు అయినంత మేర‌కు 20 శాతానికి త‌గ్గ‌క‌ముందే చార్జ్ చేస్తే బెట‌ర్‌. అదేవిధంగా 100 శాతం పూర్తి అయినా త‌రువాత చాలా మంది గంట‌ల పాటు అదేవిధంగా చార్జింగ్ పెట్టి ప‌ని చేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదు. బ్యాట‌రీ ఎక్కువ కాలం బాగుండాలంటే పూర్తిగా అయిపోయే ముందే చార్జ్ చేస్తూ 100 శాతం పూర్త‌య్యాక ఆపేయాలి.

వీటిని డిసెబుల్ చేయండి

ఒక‌వేళ అవ‌స‌రం లేని సాప్ట్‌వేర్‌లు ఆటోస్టార్‌లో ఉంటే వాటిని డిసేబుల్ చేయండి. టాస్క్‌మేనేజ‌ర్ స్టార్ట్ ఆప్‌లో ఇవి ఉంటాయి. వీటిని డిసేబుల్ చేస్తే.. ల్యాప్‌టాప్ ఆన్ చేయ‌గానే ర‌న్ అయ్యే ఫ‌ర్మిష‌న్‌ను తీసేసిన‌ట్టే. అదేవిధంగా ఏవైనా అద‌నంగా గ్రాఫిక్ ఎఫెక్ట్స్ ఆన్ లో ఉన్నా డిసేబుల్ చేయండి. దీనివ‌ల్ల కూడా బ్యాట‌రీ లైఫ్ మెరుగుప‌రుచుకోవ‌చ్చు.

Also Read :

స‌మంత మాదిరిగానే న‌య‌న‌తార కూడా విడాకుల‌తో విడిపోతుంద‌ట‌.. అందుకోస‌మేనా..?

Video Viral : పెళ్లి అయిన వెంట‌నే శ‌రీరాల‌కు నిప్పంటించుకున్న నూత‌న జంట‌..!

Visitors Are Also Reading