Home » విరుష్క దంపతులు మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నారా? ఆ ఫొటోలకు కారణమిదే..!

విరుష్క దంపతులు మళ్లీ అమ్మానాన్నలు కాబోతున్నారా? ఆ ఫొటోలకు కారణమిదే..!

by Anji
Ad

కొన్ని రోజులుగా నటి అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై అనుష్క శర్మ కానీ, విరాట్ కానీ క్లారిటీ ఇవ్వలేదు. అయినా కూడా గాసిప్ లు గుప్పుమంటున్నాయి. దీంతో పాటు అనుష్క శర్మ బేబీ బంప్ తో ఉందంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అనుష్క దంపతులు మళ్లీ అమ్మనాన్నలవుతున్నారని చాలామంది నమ్ముతున్నారు.

Advertisement

అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెంట్ అయిందనే గాసిప్ లకు చాలా కారణాలు ఉన్నాయి. జీరో సినిమా విడుదలైన తర్వాత కొత్త సినిమాలను అంగీకరించడం లేదు. ఇప్పటికే అంగీకరించిన చక్దా ఎక్స్ ప్రెస్ సినిమా విడుదల అంతకంతకూ ఆలస్యం అవుతుంది. రెండో సంతానం కావాలనే ఉద్దేశంతోనే ఆమె నటనకు దూరంగా ఉండిపోయిందని పలువురు భావిస్తున్నారు. ఇప్పుడు అనుష్క, విరాట్ కోహ్లీ లకు సంబంధించిన మరొక ఫోటో నెప్పింట తెగ వైరలవుతుంది. ఇందులో విరాట్ సతీమణి బేబీ బంప్ తో కనిపిస్తోంది. అయితే ఇది కొత్త ఫోటో కాదు. దీపావళి పండగ 2018 సందర్భంగా క్లిక్ చేసిన ఫోటో. దానిని ఇప్పుడు ఎడిట్ చేసి మళ్లీ వైరల్ చేస్తున్నారు. దీనిని చూసిన వారందరూ అనుష్క రెండవసారి గర్భం ధరించడం నిజమేనని నమ్ముతున్నారు.

2017లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2021 జనవరిలో ఈ దంపతులకు వామిక అనే కూతురు జన్మించింది. ప్రస్తుతం కూతురు ఆలన పాలన చూసుకునే పనిలో బిజీగా ఉంటోంది అనుష్క. అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదు. ఇక అనుష్క శర్మ 2008లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. షారుఖ్ తో రబ్నే బనాదీ జోడీ సినిమాతో ఎంట్రీ లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, సంజయ్ దత్, అమీర్ ఖాన్, వరుణ్ ధావన్ వంటి స్టార్ నటులతో నటించి మెప్పించింది. విజయవంతమైన చిత్రాలను నిర్మించి మంచి విజయాలను సొంతం చేసుకుంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading