Home » April 1st 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

April 1st 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వ‌హిస్తోంది. ఏఐసీసీ ఇంఛార్జ్‌ ఠాక్రే అధ్యక్షతన నేత‌లు భేటీ కానున్నారు. భారత సత్యాగ్రహ దీక్షపై, ఈ నెల రెండో వారంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభపై చర్చ నిర్వ‌హిస్తోంది.

టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు పెంచింది. బోర్డు సభ్యుల స్టేట్‌మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు.

Advertisement

modi

గ్యాస్ వినియోగ‌దారుల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్ ధరను రూ.91.50 తగ్గిస్తూ కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

హైదరాబాద్‌లో పలుచోట్ల ఈడీ సోదాలు నిర్వ‌హిస్తోంది. ఫార్మా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ ల‌ ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వ‌హిస్తోంది. దాదాపు 15 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సోదాలు ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు.

Advertisement

దేశవ్యాప్తంగా టోల్‌ ఫీజులు పెరిగిపోయాయి. పెరిగిన ధ‌ర‌లు అర్థరాత్రి నుండే అమలులోకి వ‌చ్చాయి.


తిరుమలలో నేటి నుంచి నడకదారి భక్తులకు ఉచిత దర్శన టోకెన్ ల‌ను టీటీడీ విడుద‌ల చేస్తోంది. అలిపిరి నడకమార్గంలో 10 వేల టికెట్లను విడుద‌ల చేయ‌నున్నారు. శ్రీవారి మెట్టు నడకమార్గంలో 5 వేల టికెట్లు జారీ చేయనున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణ‌య్య భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన బీసీ నేతల టీం..కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలి.. తెలుగు రాష్ట్రాల్లో బీసీ విద్యార్ధులకు అమలు చేస్తున్న పథకాలు జాతీయ స్థాయిలో అమలు చేయాలని ఆర్ కృష్ణయ్య కోరుతున్నారు.

ఎంసెట్ పరీక్ష తేదీల్లో మార్పులు జ‌రిగాయి. ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష తేదీలను ఉన్నత విద్యా మండలి మార్పులు చేసింది. మే 12 నుండి 14 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంసెట్ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది.

Visitors Are Also Reading