Home » April 17th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

April 17th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఈ నెల 23 తెలంగాణకు అమిత్ షా రాబోతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేప‌థ్యంలో కీలకమైన చేరికలు ఉండే ఛాన్స్ ఉంద‌ని బీజేపీ వ‌ర్గాలు చ‌ర్చిస్తున్నాయి.

TSPSC పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను చంచల్‌గూడ జైలులో ఈడీ విచారించనుంది. ప్రవీణ్, రాజశేఖర్ లను విచారించడానికి నాంపల్లి కోర్టు అనుమతించింది.

Advertisement

నేటితో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై జ్యుడీషియల్ కస్టడీ విచార‌ణ ముగియ‌నుంది.

ఢిల్లీలో అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామాకు డిమాండ్ చేస్తూ బీజేపీ అసెంబ్లీ ముట్ట‌డి కార్య‌క్ర‌మం చేప‌డుతోంది.

Advertisement


నేడు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్యటించ‌నున్నారు. విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ త‌గ్గుముకం ప‌ట్టింది. క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జ‌రుగుతోంది. నిన్న శ్రీవారిని 76,201 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు.

మంత్రి గంగుల కమలాకర్‌కు తృటిలో ప్రమాదం త‌ప్పింది. చెర్లబూట్కూర్ గ్రామంలో ఓ కార్యక్రమంలో వేదిక‌ కుప్పకూలింది. దాంతో ఒక్కసారిగా మంత్రి కింద‌ప‌డిపోయారు. స్వ‌ల్ప‌గాయాల‌తో ఆయ‌న బ‌య‌ట‌పడ్డారు.

 

త‌న‌కు రాజకీయ అనుభవం లేదు కానీ ప్రజాసేవ చేయాలనే కోరిక ఉందని మ‌ల్లారెడ్డి అన్నారు. ప్రజాసేవ తప్ప వేరే కోరికలు లేవన్నారు. సీఎం కేసీఆర్ దీవెనల వల్ల ఎమ్మెల్యే , మంత్రిని అయ్యానని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గానికి నేను వాచ్‌మెన్‌లా పనిచేస్తున్నానంటూ వ్యాఖ్యానించారు.

Visitors Are Also Reading