Home » April 10th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

April 10th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY

రేపు వాయనాడ్‌ కి రాహుల్ గాంధీ వెళ్ల‌నున్నారు. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత తొలిసారిగా వాయనాడ్‌ కు రాహుల్ వెళ్ల‌నున్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా బహిరంగ సభ, రోడ్‌షో నిర్వహించనున్నారు.

గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసుకు అనుబంధంగా సుప్రీంకోర్టులో ఉస్మానియా డాక్ట‌ర్ ర‌మేష్ ఇంప్లీడ్, రిట్ పిటిషన్ వేశారు. అడిషనల్ డెరైక్టర్ల, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారుల వయో పరిమితి పెంపు బిల్లు ఆమోదించవద్దంటూ డాక్టర్ రమేష్ పిటిషన్ లో పేర్కొన్నారు.

నేడు చీరాలలో ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప‌ర్య‌టిస్తున్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చీరాలకు గవర్నర్ హాజ‌రుకానున్నారు. మధ్యాహ్నం 2గం.లకు చీరాల మండలం వాడరేవు చేరుకుని ఐటీసీ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు.

నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ పెండింగ్ బిల్లుల ఆమోదం పిటిషన్ పై విచారణ జ‌ర‌గ‌నుంది. గవర్నర్ వద్ద ఉన్న 10 పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిటిషన్ దాఖలు చేశారు.

తిరుపతి కాణిపాకం ఆలయంలోని నిత్యాన్నదానం, ప్రసాదాల తయారీ పోటు, గిడ్డంగిలో నిత్యావసరాలను దొడ్డిదారిన తరలించిన ఏడుగురు ఉద్యోగులపై వేటువేశారు. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అక్ర‌మార్కుల‌ను విధుల నుండి తొల‌గించారు.

ఈ నెల 21 నుండి ఏపీ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్ల‌నున్నారు. వారం రోజుల పాటు కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనలో సీఎం జగన్ గ‌డ‌ప‌నున్నారు.

కామారెడ్డి మండలం ఇస్రోజివాడాలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటున్న 13 నెలల బాలుని పైకి దూసుకెళ్లిన కారు…ఆయాన్షు అనే బాలుడు అక్కడికక్కడే క‌న్నుమూశాడు. తండ్రి స్వామి కారును రివర్స్ తీస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

తిరుమలలో 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం ప‌డుతోంది. నిన్న శ్రీవారిని 86,129 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు.

హైదరాబాద్‌: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పలు విమానాల రద్దు. ప్రయాణీకుల ఆందోళన. హైదరాబాద్ నుండి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ విమానాలు రద్దు. ప్రయాణీకులకు సమాచారం అందించని ఎయిర్ లైన్స్ సంస్థ…(1/2)

Visitors Are Also Reading