Home » కోహ్లీ నవ్వు అనుష్కకి నచ్చడం లేదా…?

కోహ్లీ నవ్వు అనుష్కకి నచ్చడం లేదా…?

by Azhar
Ad

దేశ వ్యాప్తంగా ఉన్న సెలబ్రెటీ జంటలో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జంట విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ. వీరు చేసే ప్రతి పనిని అభిమానులు క్షుణంగా పరిశీలిస్తుంటారు. ఇక తాజాగా అనుష్క చేసిన ఓ పనితో కోహ్లీ నవ్వు అనుష్కకి నచ్చడం లేదా అనుమానాలు వస్తున్నాయి.. అయితే ప్రస్తుతం ఐపీఎల్ 2022 లో ఆడుతున్న విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. రన్ మిషన్ గా పేరున్న విరాట్ రన్స్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు.

Advertisement

అందువల్లే ఈ ఒక్క సీజన్ లోనే మూడు సార్లు గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. దాంతో కోహ్లీ పై చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఈ గోల్డెన్ డక్ ఔట్ అయిన ప్రతిసారి కోహ్లీ ఒక రమైన నవ్వు నవ్వుతు పెవిలియన్ కు వచ్చేవాడు. ఆ నవ్వు కొంత మంది అభిమానులకు బాధను కలిగిస్తే… మరి కొంత మందికి ఆగ్రహాన్ని తెచ్చేది. ఇక తాజాగా కోహ్లీ ఇచ్చిన ఐ ఇంటర్వ్యూ లో గోల్డెన్ డక్ ఔట్ తర్వాత ఎందుకు అలా నవ్వుతున్నారు అని ప్రశ్నించిన వెంటనే… గట్టిగ నవ్వినా కోహ్లీ.. నేను ఎప్పుడు వరుసగా రెండు సార్లు గోల్డెన్ డక్ ఔట్ కాలేదు. అందుకే అప్పుడు అలా నవ్వు వచ్చింది అని చెప్పాడు.

Advertisement

కోహ్లీ చెప్పిన ఈ వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో లింక్ ను తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో అనుష్క శర్మ పోస్ట్ చేస్తూ.. ‘నిన్ను చూసి నువ్వే నవ్వుకోకుంటే ఈ 100 ఏళ్లలో అద్భుతమైన జోక్ ను నువ్వు మిస్ అవుతావ్..’ అంటూ రాసుకొచ్చింది. అంటే అనుష్క.. ని ఫెల్యూర్ మీద నువ్వే ఎందుకు నవ్వుకుంటున్నావ్ అంటూ కోహ్లీకి ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చింది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి :

జడేజా ఎప్పటికి చెన్నైతోనే ఉంటాడట…!

బీసీసీఐకి ఎదురు తిరుగుతున్న కస్టమర్లు…!

Visitors Are Also Reading