Home » “మీ ఐరెన్ లెగ్ వల్లే టీం ఇండియా ఓడిపోయింది” అంటూ అనుష్క శర్మని తిట్టిపోస్తున్న నెటిజన్స్!

“మీ ఐరెన్ లెగ్ వల్లే టీం ఇండియా ఓడిపోయింది” అంటూ అనుష్క శర్మని తిట్టిపోస్తున్న నెటిజన్స్!

by Srilakshmi Bharathi
Ad

తాజాగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీం ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 444 పరుగులను ఆసీస్ టార్గెట్ గా ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించే క్రమంలో రోహిత్ సేన 234 పరుగులకు చేరుకొని అవుట్ అయిపొయింది. ఆఖరి రోజు విజయానికి 280 పరుగులు చెయ్యాల్సి ఉంది. అయితే అప్పటికి ఫీల్డ్ లో ఉన్న విరాట్, రహానే లపై క్రికెట్ అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.

anushka sarma

Advertisement

విరాట్ అనూహ్యంగా వికెట్ పోగొట్టుకోవడం, అదే ఓవర్ లో జడేజా కూడా వెనక్కి వచ్చేయడంతో టీం ఇండియా కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ క్రమంలో నెటిజన్స్ టీం ఇండియా పై పెద్ద ఎత్తునే కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు అయితే ఏకంగా ఈ ఓటమికి అనుష్క శర్మ కారణం అంటూ నిందిస్తున్నారు.

anushka sarma

Advertisement

డబ్ల్యుటిసి ఫైనల్స్ లో కోహ్లీ విఫలం అవ్వడానికి అనుష్కే కారణమని తిట్టిపోస్తున్నారు. ఐసీసీ ఈవెంట్స్ లో అనుష్క శర్మ స్టేడియంలో ఉంటె టీం ఇండియా విన్నింగ్ పర్శంటేజ్ జీరో గా ఉందని పేర్కొంటున్నారు. ఆమెను స్టేడియం లోకి రాకుండా అడ్డుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. విరాట్ అభిమానిగా చెప్పుకున్న ఓ నెటిజెన్ అనుష్క శర్మని “దయచేసి ఇక ముందు మ్యాచ్స్ కు హాజరు కావద్దని” కోరాడు.

మరిన్ని ముఖ్యమైన వార్తలు:

అంబానీ డ్రైవర్ నుండి కుక్ వరకు వారి జీతం ఎంతో తెలుసా?

మీరు దారిలో ఈ ఐదు విషయాలను గమనించినట్టయితే మీకు అన్నింట్లో విజయం లభించడం పక్కా..!

ఎన్టీఆర్ కుటుంబంలో ఎంత మంది మరణించారో తెలుసా ?

Visitors Are Also Reading