Home » పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన అనుష్క.. కచ్చితంగా అప్పుడే..!

పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన అనుష్క.. కచ్చితంగా అప్పుడే..!

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ మూవీతో ఎంట్రీ ఇచ్చించి అనుష్క. ఇక ఆ తరువాత వరుస సినిమాల్లో నటిస్తూ.. ఆ తరువాత అరుంధతి సినిమాతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో అనుష్క నటనకు తెలుగు వారు మంత్ర ముగ్దులయ్యారు. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సాధించడంతో అనుష్కకి వరుస అవకాశాలు లభించాయి.

Advertisement

నాగార్జున, రవితేజ, ప్రభాస్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించిన ఈ బ్యూటీ.. బాహుబలి తరువాత కాస్త సైలెంట్ అయిపోయింది. బాహుబలి మూవీలో దేవసేన పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. ఇక ఆ తరువాత ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. నిశ్శబ్దం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ ఓటీటీలోనే విడుదలైంది. చాలా కాలం తరువాత అనుష్క నటిస్తొన్న తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కిస్తు ఈ చిత్రంలో జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 07న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో హీరో నవీన్ పొలిశెట్టి ఈ మూవీ ప్రమోషన్లలో చాలా బిజీగా ఉండగా.. ఇప్పుడు అనుష్క కూడా ఇందులో భాగం అయింది.

Advertisement

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సినిమా సంగతులతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ తరుణంలో తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది అనుష్క. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని.. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చేసుకుంటానని వెల్లడించింది. ఈ మూవీలో తన పాత్ర పేరు అన్విత అని.. అనుకున్న పని పూర్తి చేయడం కోసం  దేనికైనా సిద్ధపడే మనస్తత్వం గల అమ్మాయి అని తెలిపింది. ఇప్పటివరకు తాను పోషించిన దేవసేన, అరుంధతి, భాగమతి పాత్రల కంటే అన్విత పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని.. ఇలాంటి రోల్స్ రావాలంటే అదృష్టం ఉండాలని చెప్పుకొచ్చింది. మరోవైపు పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా ఈ ట్రెండ్ కొనసాగుతుందని.. శ్రీదేవి వంటి వారు చాలా ఏళ్ల కిందటే పాన్ ఇండియా మూవీస్ లో నటించారని తెలిపారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Rajamouli : మరోసారి తండ్రి కాబోతున్న జక్కన్న.. ?

ప్రభాస్ సలార్ మూవీ వాయిదా..? విడుదల అప్పుడేనా ?

Visitors Are Also Reading