Home » ఆ ఫుట్ బాల్ కీలక ఆటగాడి ఖాతాలోకి మరో ప్రపంచ రికార్డు..!

ఆ ఫుట్ బాల్ కీలక ఆటగాడి ఖాతాలోకి మరో ప్రపంచ రికార్డు..!

by Anji
Ad

సాధారణంగా ఫుట్ బాల్ అభిమానులు కానీ వారు చాలా మంది ఉంటారు. కానీ క్రిస్టియానో రొనాల్డో పేరును ఒక్కసారి కూడా వినని వారు ఉండరు. ఫుట్ బాల్ చరిత్రలో అతను ఓ లెజెండ్ అనే చెప్పాలి. పోర్చుగల్ ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ క్రిస్టియానో ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో ఘనాతో జరిగిన మ్యాచ్ లో ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. 

Advertisement

పురుషుల ప్రపంచ కప్ చరిత్రలో 5 వేర్వేరు టోర్నమెంట్లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా అతను నిలిచాడు.  ఇక ఈ వారం ప్రారంభం వరకు కూడా అతను నాలుగు వేర్వేరు ప్రపంచ కప్ టోర్నమెంట్ లలో గోల్ చేసిన ఆటగాడిగా పీలే, ఉవె సీలర్, మిరోస్లావ్ క్లోస్, లియోనెల్ మెస్సీతో పాటు ఉండేవాడు. 5 వేర్వేరు ప్రపంచ కప్ టోర్నమెంట్ లలో గోల్స్ చేసిన రొనాల్డో రికార్డు పుస్తకాల్లో ఒంటరిగా నిలిచాడు. 2006 తరువాత జరిగిన ప్రతీ ప్రపంచ కప్ లో తన స్కోర్ ని నమోదు చేశాడు. 

Advertisement

 ప్రపంచ కప్ లో రొనాల్డో తన మొదటి గోల్ 2006లో ఇరాన్ పై చేశాడు. 2010లో ఉత్తర కొరియాపై.. 2014లో ఘానాపై.. 2018 నాటికి ఇంటర్నేషనల్ గోల్ క్రేజ్ గా పోర్చుగల్ మారడానికి అతను ఘానాపై చేసిన గోలే కారణం. 2018లో గోల్ చేసిన రొనాల్డో తన గోల్ స్కోరింగ్ పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా ఘనాతో జరిగిన మ్యాచ్ లో గోల్ చేశాడు రొనాల్డో.  పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటికీ మొత్తం 8 గోల్స్ చేశాడు. 2006, 2010, 2014 సంవత్సరాలలో ఒక్కోగోల్ చేసిన రొనాల్డో.. 2018లో ఏకంగా 4 గోల్స్ చేశాడు. ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్ లో భాగంగా ఘనాతో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ లో క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ 3-2 తేడాతో విజయం సాధించింది. 

Also Read :   పెళ్లికి ముందే తండ్రి అయినా స్టార్ క్రికెటర్..!

Visitors Are Also Reading