Home » అప్సర కేసులో ట్విస్ట్…సీన్ లోకి కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో !

అప్సర కేసులో ట్విస్ట్…సీన్ లోకి కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో !

by Bunty
Ad

 

అప్సరా కేసులో కొత్త కొత్త కోణాలు బయటపడుతున్నాయి. సరూర్‌ నగర్‌ కు చెందిన సాయికృష్ణ అనే పూజారి.. అప్సరాను చంపేశాడు. అనంతరం… ఓ మ్యాన్‌ హోల్‌ లో పూడ్చేశాడు. అయితే.. ఈ కేసును పోలీసులు చేధించి… సాయికృష్ణ ను అరెస్ట్‌ చేశారు. అయితే.. అప్సరకు ఇప్పటికే పెళ్లయినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పెళ్లి ఫోటోలు. అప్సరను చూసి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా.

Advertisement

అయితే.. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అప్సర హత్య తర్వాత కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో విడుదల చేసింది. తన కుమారుని మానసికంగా వేధింపులకు గురి చేయడంతోనే కార్తీక్ రాజా ఆత్మ** త్య చేసుకున్నాడని కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆరోపణలు చేసింది. పెళ్లి అయిన కొద్ది రోజులకే లగ్జరీగా బతకాలంటూ టూర్లకు తీసుకెళ్లాలంటూ అప్సర ఆమె తల్లి అరుణ వేధింపులకు గురి చేశారని పేర్కొంది ధనలక్ష్మి.

Advertisement

తన కుమారుడితో రోజు గొడవలు పడే వారిని ఒకరోజు తన కుమారుడిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో తట్టుకోలేకపోయాడని.. కార్తీక్ రాజాను అరెస్టు చేసి జైల్లో పెట్టించారని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మానసికంగా కృంగిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ అవమానాన్ని భరించలేక తన కుమారుడు ఆత్మ** త్య చేసుకున్నాడని కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి వీడియో రిలీజ్‌ చేసింది.

తన కుమారుడి చావుకు అప్సర, తల్లి అరుణానే కారణం అంటూ ఈ వీడియో లో కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి స్ఫష్టం చేసింది. అప్పటినుండి అప్సర, అప్సర తల్లి అరుణ ఇద్దరూ కనిపించలేదని.. అప్సర హ** కాబడిందని మీడియాలో వార్తను చూసి తెలుసుకున్నానంటూ చెప్పుకొచ్చారు కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి. అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండేదని.. అందుకోసమే అప్సర ను తీసుకొని హైదరాబాద్ వెళ్లి ఉంటుందని భావిస్తున్నానని చెప్పింది కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి.

మరిన్ని ముఖ్య వార్తలు !

ఆ నటికి చెవిటి, మూగ..! కానీ ఒకే ఒక్క సినిమాతో

అప్సర కేసులో అదిరిపోయే ట్విస్ట్! ఇది అస్సలు ఊహించలే కదా ?

Visitors Are Also Reading