Home » పెళ్లి పీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ జంట.. ఆదిపురుష్ విడుదల రోజే పెళ్లి ?

పెళ్లి పీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ జంట.. ఆదిపురుష్ విడుదల రోజే పెళ్లి ?

by Anji
Ad

టాలీవుడ్ లో వరుసగా భాజా భజంత్రీలు మ్రోగుతున్నాయి. ఇప్పికే తెలుగు హీరోలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ లో ఒకరు అయినటువంటి శర్వానంద్ రీసెంట్ గా రక్షితారెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్న ప్రేమ జంట వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు కూడా ఒకటి కాబోతున్నారనే వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. జూన్ 09న వీరి నిశ్చితార్థం హైదరాబాద్ లో జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా మెగా కుటుంబం కానీ లావణ్య కానీ ఎటువంటి స్పందన రాలేదు. ఇప్పుడు మరోజంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందంటూ ఓ వార్త హల్ చల్ చేస్తుంది. 

Advertisement

అడివి శేష్.. మోస్ట్ హ్యాండ్సమ్, ఎలిజబుల్ బ్యాచ్ లర్. వరుస హిట్ లతో దూసుకెళ్తున్నాడు. చేసినవి ఇతను కొద్ది సినిమాలు అయినా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇతను చూడటానికి కూడా మంచి హ్యాండ్ సమ్ గానే ఉంటాడు. ప్రస్తుతం ఈ హీరో సింగిల్ లైఫ్ కి ఎండ్ కార్డు వేసుకునేందుకు సిద్ధం అయినట్టు తెలుస్తోంది. అక్కినేని నాగార్జున మేనకోడలు, నటి సుప్రియతో ప్రేమలో ఉన్నాడని గత కొద్ది కాలం నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెతో కలిసి ఏడడుగులు వేయబోతున్నాడని సమాచారం. జూన్ 16న వీరు పెళ్లి బంధంతో ఏకం కాబోతున్నారని తెలుస్తోంది. జూన్ 16 ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అదే రోజూ అడివి శేష్ పెళ్లినా ? అని కొందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  అడివి శేష్ నుంచి.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. 

Advertisement

నాగార్జున మేనకోడలు సుప్రియ తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో నటించింది. హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు రాలేదో లేక సినిమాలు వద్దనుకుందో తెలియదు. కానీ సినిమాలకు పరోక్షంగా దూరమైంది. ఇష్టం హీరో చరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనే సుమంత్ డెబ్యూ మూవీ కాళిదాస్ కి దర్శకుడు. మనస్పార్థాలు రావడంతో అతనితో విడిపోయింది సుప్రియ. అతను అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయాడు. ఇక ఆ తరువాత గూఢచారితో మూవీతో   ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అప్పట్లో వీరు ప్రేమలో ఉన్నారనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ గురించి అధికారికంగా ప్రకటించలేదు.  అడివి శేష్-సుప్రియ ప్రేమ వ్యవహారమా.. వరుణ్ తేజ్- లావణ్యల బంధమా.. ఎవరు పెళ్లి పీటలెక్కుతారో వేచి చూడాలి మరీ. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్రశాంత్ నీల్ శుభవార్త చెప్పనున్నారా ?

యాంకర్ రష్మీ..ఒక్క షోకు ఎంత తీసుకుంటుందో తెలుసా ?

 ప్రభాస్ వర్షం సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading