Home » ప్రభాస్ వర్షం సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా ?

ప్రభాస్ వర్షం సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా ?

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరోగా రాణిస్తున్న హీరోలలో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నాడు. వరుస సినిమాల్లో ప్రభాస్ దూసుకెళ్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తరువాత వచ్చిన బాహుబాలి 2 సినిమా ప్రభాస్ రేంజ్ ని మరింత పెంచేసింది. ఆ తరువాత వచ్చిన ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. అయితే ప్రభాస్ కి స్టార్ డమ్ తీసుకొచ్చిన సినిమా ఏదంటే.. టక్కున చెప్పే పేరు వర్షం. ఎం.ఎస్.రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు శోభన్ దర్శకుడు.

Advertisement

ఈ మూవీలో ప్రభాస్ జోడీగా త్రిష నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రభాస్- త్రిష కెమెస్ట్రీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ మూవీలో ప్రభాస్ కి ప్లేస్ లో ముందుగా హీరోగా మరొకరిని అనుకున్నారట. అయితే వర్షం మూవీలో తొలుత సూపర్ స్టార్ మహేష్ బాబుని హీరోగా అనుకున్నారట దర్శకుడు శోభన్. అయితే మూవీ కథను తొలత మహేష్ బాబు రాసుకున్నారట. అయితే శోభన్ మహేష్ కి కథను వివరించగా ఆయన సున్నితంగా తిరస్కరించారట. 

Advertisement

వర్షం కథ విన్న మహేష్.. ఈ మూవీ కథకి నేను సెట్ కాను అని రిజెక్ట్ చేశారట. దీంతో శోభన్ ఈ మూవీని ప్రభాస్ తో చేశారట. ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. అదేవిధంగా ఈ సినిమాలో గోపిచంద్ విలన్ గా నటించి మెప్పించారు. ఈ మూవీ తరువాత గోపిచంద్ ప్రభాస్ మంచి మిత్రులు అవుతారు. 

 మరికొన్ని  ముఖ్యమైన వార్తలు : 

అన్నగారు చివరి రోజుల్లో “నా అసలైన వారసుడివి నువ్వేరా” అని ఎందుకు చెప్పారంటే ?

పెళ్లి కాకముందే నిహారిక కోసం లావణ్య త్రిపాఠి అంతటి త్యాగం చేసిందా..?

Visitors Are Also Reading