Home » వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఒకేసారి రెండింటిలో షేర్ చేసుకోవచ్చు..!

వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఒకేసారి రెండింటిలో షేర్ చేసుకోవచ్చు..!

by Anji
Ad

నిత్యం  యూజర్లను ఏదో ఒక ఫీచర్ తో అట్రాక్ట్ చేస్తూ ఫీచర్స్ ని తీసుకొస్తుంది వాట్సాప్. ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్ క్రేజ్ తగ్గకపోవడానికి ఇదే ప్రధాన కారణం అని చెప్పవచ్చు.  నెటిజన్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ తాజాగా ఆసక్తికర ఫీచర్ ని పరిచయం చేసింది.  

Also Read :  గొడవ కి ఫుల్ స్టాప్ పెట్టిన విరాట్-షారూఖ్.. ఫ్యాన్ ఖుషీ..!

Advertisement

వాట్సాప్ లో స్టేటస్ గా షేర్ చేసే ఫోటోను ఏకకాలంలో ఫేస్ బుక్ లో షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ లో షేర్ చేసిన స్టేటస్ ను ఫేస్ బుక్లో షేర్ చేయాలంటే మళ్లీ ఫేస్ బుక్ యాప్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి. ఈ కొత్త ఫీచర్ సాయంతో ఒకేసారి వాట్సాప్ తో పాటు ఫేస్ బుక్ లో స్టేటస్ ని షేర్ చేయవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.  

Advertisement

Also Read :   ఖాళీ కడుపుతో మీరు టీ తాగుతున్నారా ? అయితే ఈ సమస్యలతో జాగ్రత్త..!

Manam News

 

ప్రస్తుతం వాట్సాప్ స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్ లో మై కాంటాక్ట్స్, మైకాంటాక్ట్స్ ఎక్సెప్ట్, ఓన్లీ షేర్ విత్ ఆప్షన్స్ ఉన్నాయి. త్వరలోనే వీటి జాబితాలో ఫేస్ బుక్ కూడా కనిపించనుంది. దీంతో వాట్సాప్ స్టేటస్ లో షేర్ చేయాలనుకునే ఫోటో లేదా వీడియోను ఫేస్ బుక్ లోనూ పోస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ చేస్తున్న ఈ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆండ్రాయిడ్ తో పాటు ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ ను తీసుకొచ్చే ప్లాన్ లో ఉంది వాట్సాప్.  

Also Read :  పెళ్లికి ముందు తండ్రి కొడుక్కి నేర్పించాల్సిన 4 విష‌యాలు..2వ‌ది ఇంపార్టెంట్!

Visitors Are Also Reading