Home » వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. ఇక నుంచి వెబ్ వాట్సాప్ లో కూడా..!

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. ఇక నుంచి వెబ్ వాట్సాప్ లో కూడా..!

by Anji
Ad

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ ఏదైనా ఉందంటే అది వాట్సాప్‌ అని చెప్పడంలో సందేహం లేదు. మార్కెట్లోకి ఎన్నో రకాల కొత్త మెసేజింగ్ యాప్స్‌ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌కు ఆదరణ తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇందులోని ఫీచర్స్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకీ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌ ఉందని చెప్పాలి.

Advertisement

ముఖ్యంగా సెక్యూరిటీకి పెద్దపీట వేస్తూ వాట్సాప్‌ ఫీచర్‌లను పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌. యాప్‌లో లాక్‌ చేసిన చాట్‌లను వెబ్‌లో యాక్సెస్‌ చేసుకునేందుకు ప్రత్యేకంగా సీక్రెట్‌ కోడ్‌ అవసరమయ్యేలా ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను రూపొందిస్తున్నారు. దీంతో ఇటీవల మొబైల్‌ వెర్షన్‌లో తీసుకొచ్చిన ‘లాక్‌ చాట్’ ఫీచర్‌ను వెబ్‌ వెర్షన్‌కు కూడా విస్తరించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లందరికీ తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌. లాక్‌ చేసిన చాట్‌లను వాట్సప్‌ వెబ్‌ ఓపెన్‌ చేయాలంటే ముందే సెట్‌ చేసుకున్న సీక్రెట్‌ కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. తద్వారా వ్యక్తిగత లేదా రహస్య సమాచారం ఇతరులకు లీక్‌ కాకుండా ఉంటుంది. ఈ ఫీచర్‌ ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసే వారికి ఎక్కువగా ఉపయోగపడనుంది. ఒకవేళ పొరపాటున లాగవుట్ చేయడం మర్చిపోయిన, మీ సీక్రెట్ చాట్‌లను ఎవరూ చూడకుండా ఉంటుంది. త్వరలోనే వాట్సాప్‌ అప్‌డేట్‌ వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను యాడ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read : పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విరాట్-అనుష్క దంపతులు.. పేరు ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading