Home » పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విరాట్-అనుష్క దంపతులు.. పేరు ఏంటో తెలుసా ?

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విరాట్-అనుష్క దంపతులు.. పేరు ఏంటో తెలుసా ?

by Anji
Ad

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులు రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ఫిబ్రవరి 15న తమ రెండవ సంతానం అకాయ్  అనే మగబిడ్డ పురుడుపోసుకున్నట్లు అనుష్కశర్మ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.  ఈ వార్త తెలియగానే వీరిద్దరికీ సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisement

ఈ బాలీవుడ్ నటి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన కుమారుడి పేరును కూడా పోస్ట్‌లో వెల్లడించింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. అనుష్క రెండోసారి గర్భం దాల్చిందని వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయాన్ని ఇద్దరూ ధృవీకరించలేదు. కొంతకాలం క్రితం, దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరి రహస్యాన్ని వెల్లడించాడు. ప్రెగ్నెన్సీ పుకార్లలో నిజంగా నిజం ఉందని అప్పుడు నమ్మారు. అయితే, ఆ తర్వాత ఏబీడీ ఈ వార్త నిజం కాదంటూ ప్రకటించాడు. దీంతో అందరిలో అయోమయం నెలకొంది.

ఇంగ్లండ్ జట్టుతో జరుగుతోన్న 5 టెస్టుల సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ కారణాల వల్ల సిరీస్ నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కానీ, సరైన రీజన్ మాత్రం వెల్లడించలేదు. ఈ క్రమంలో ఎన్నో పుకార్లు వినిపించాయి. అటు బీసీసీఐ మాత్రం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదని అభిమానులను కోరింది. మొత్తానికి కోహ్లీ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న రీజన్ ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసిందన్నమాట.

Also Read :  ఇంగ్లండ్‌తో.. నాలుగో టెస్ట్ ఆడే.. భారత టీం వివరాలివే..!

Visitors Are Also Reading