దేశంలో రోజు రోజుకు కులవ్యవస్థ పెరిగిపోతుంది. కంప్యూటర్ కాలంలో కూడా కులం, మతం అనే పట్టింపుల మూలంగా ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. తమ కులం కానీ వాడు తమ కూతురుని పెళ్లి చేసుకున్నాడని ఇలా తండ్రులు కక్ష పెంచుకుని ఎందరివో ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తరుచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ తరహానే మరొక ఘటన చోటు చేసుకుంది.
Advertisement
హైదరాబాద్ నగరంలో ఇటీవలే సరూర్‌నగర్‌లో నాగరాజు అనే వ్యక్తి మరణం మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. కేవలం 15 రోజుల కాల వ్యవధిలోనే ఇద్దరు యువకులు చనిపోవడం హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్లితే.. మార్వాడీ అయినటువంటి మహేందర్ పర్వాన్ కుటుంబంతో కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చి బేగంబజార్ పరిధిలో ఉన్నటువంటి కొల్సావాడి ప్రాంతంలో స్థిరపడ్డారు. పల్లీల హోల్‌సేల్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. ఈయనకు కుమారుడు నీరజ్ పర్వాన్ (25) ఉన్నాడు. వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో ఉంటున్న సంజనతో అతనికి పరిచయం ఏర్పడింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన సంజన తల్లిదండ్రులు ఉత్తర భారతదేశం నుండి వలసొచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.
నీరజ్-సంజనల పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను మందలించారు. అదేవిధంగా తమ కూతురు జోలికి రావద్దని నీరజ్‌ను హెచ్చరించారు. గత ఏడాది ఏప్రిల్‌లో సంజన, నీరజ్‌లు ఇంట్లోంచి వెళ్లి పోయి ఆర్యసమాజ్ వివాహం చేసుకున్నారు. రెండు నెలల పాటు అందరికీ దూరంగా ఉన్నారు. ఆ తరువాత సంజన గర్భవతి కావడంతో తిరిగి వారి కాలనీలోనే ఉంటున్నారు. తమ కూతురును పెళ్లి చేసుకున్నాడని అప్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఇటీవలే సంజన మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ బాబుకు 3 నెలలు. నీరజ్‌ను చంపాలని పథకం వేశారు. ఐదుగురు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. పల్లీల వ్యాపారం చేస్తున్న తన తండ్రి వద్దకు శుక్రవారం నీరజ్ వెళ్లి తిరిగి వస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు రెండు బైకులను వెంబడించారు. నీరజ్ తన ఇంటి సమీపం వద్దకు చేరుకోగానే దండగులు కత్తులతో దాడి చేశారు.
Advertisement
దాదాపు 20 సార్లు విచక్షణ రహితంగా పొడిచారు. తరువాత రాడ్లతో కొట్టారు. చనిపోయాడో లేదో అనే అనుమానంతోనే అక్కడే ఉన్న గ్రానైట్ రాయిని నీరజ్‌పై ఎత్తేశారు. అతడు మరణించాడని నిర్దారించుకున్న తరువాత రెండు బైకులపై పారిపోయారు. నీరజ్‌ను నడిరోడ్డుపై దారుణంగా కత్తులతో పొడుస్తున్న తరుణంలో వందలాది మంది అక్కడే నిల్చొని చోద్యం చేస్తున్నారు. కొంత మంది ఏకైక సెల్‌ఫోన్‌లలో వీడియోలు తీస్తూ కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు నిందితును అదుపులోకి తీసుకుని బైకులు, కత్తులు, రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. నీరజ్‌పై కక్ష పెంచుకున్న సంజన కుటుంబ సభ్యులే మరికొందరితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది. నీరజ్ మరణానికి నిరసనగా ఇవాళ బేగంబజార్ బంద్‌కు మార్వాడీ వ్యాపారాలు పిలుపునిచ్చారు. ఇలా కులాంతర వివాహం చేసుకున్న వారిని ఇంకా ఎంత మందిని చంపుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రణయ్, నాగరాజు, ఇప్పుడు నీరజ్ పర్వాన్ ఇలా చంపడం వల్ల ప్రయోజనం ఏమిటని పేర్కొంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్‌గా మారింది.
Also Read :
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి కుటుంబ సహకారం అందుతుంది
జిమ్ములో ప్రగ్యా జైస్వాల్ కసరత్తులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!