Home » ఓటీటీ లోకి డైరెక్టుగా రాబోతున్న ఈ హారర్ సినిమా చూసి తట్టుకోగలరా ?

ఓటీటీ లోకి డైరెక్టుగా రాబోతున్న ఈ హారర్ సినిమా చూసి తట్టుకోగలరా ?

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా ఓటీటీలోకి ప్రతీ వారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే మనకు నచ్చుతాయి. ఈ మధ్య కాలంలో రొటిన్ కి భిన్నంగా ఓటీటీ సంస్థలు కూడా కొత్త కథాంశాలతో ప్రేక్షకులను అలరించేందుకు కొత్త కంటెంట్ సినిమాలు, సిరీస్ లు తీసుకొస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ మరో హర్రర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇందులో గురు ఫేమ్ హీరోయిన్ రితికాసింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆ సినిమా ఏంటి..? ఎందులో స్ట్రీమింగ్ కానుంది. స్టోరీ తదితర వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

రితికాసింగ్ తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అమాయకపు చూపులతో అందరి మనస్సును దోచేసింది. రితికాసింగ్ హీరోయిన్ కాదు.. ఆమె మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి కూడా. రితికాసింగ్ 2009లో భారత్ తరపున ఆసియన్ ఇండోర్ గేమ్స్ సూపర్ ఫైల్ లీగ్ పోటీల్లో కూడా పాల్గొంది.  ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తనకు నటనపై ఆసక్తి ఉండటంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రితికా 2012లో ఇరుదచుట్రు అనే మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతోనే మాధవన్ హీరోగా నటించగా.. రితికా ఇందులో బాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించింది. ఈ మూవీ తెలుగులో గురు పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించాడు. బాక్సర్ పాత్రలో రితికా అభినయానికి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. స్వతహాగా మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ బాక్సర్ కావడంతో ఈ పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. గురు చిత్రం తరువాత పలు కోలీవుడ్ సినిమాలు కూడా చేసింది. చివరగా విజయ్ ఆంటోనీ హత్య మూవీలో నటించింది.

Advertisement

 

ఈ విషయం పక్కకు పెడితే.. రితికా ఓ హరరర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన హార్రర్ మూవీ వళరి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో విడదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్ లో మార్చి 06 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఇందులో రితికాసింగ్ తో పాటు శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కెప్టెన్ నవీన్ నాయుడుగా కనిపించనున్నారని తెలుస్తోంది. శ్రీరామ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ లభించింది.  తాజాగా విడుదల చేసిన వళరి నుంచి ఓ పోస్టర్ రిలీజ్ అయింది. అందులో రితికా దీనంగా పడుకొని ఉంది. వెనక వైపు జుట్టు విరబోసుకున్న ఓ బాలిక నిలబడి ఉందని పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన టీజర్‌, ట్రైలర్‌ను రిలీజ్‌ చేయనున్నారు మేకర్స్. ఇక రితికా సింగ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ర‌జ‌నీకాంత్ ‘వేట్టైయాన్‌’లో కూడా నటిస్తుంది.

Also Read :  ఆర్తి అగర్వాల్ కెరీర్ ని నాశనం చేసిన వాళ్లు ఎవరు ?

Visitors Are Also Reading