Home » ఆర్తి అగర్వాల్ కెరీర్ ని నాశనం చేసిన వాళ్లు ఎవరు ?

ఆర్తి అగర్వాల్ కెరీర్ ని నాశనం చేసిన వాళ్లు ఎవరు ?

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వెంకటేష్ హీరోగా నటించిన నువ్వునాకు నచ్చావ్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది. టాలీవుడ్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ ఇలా స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ఇలా చాలా సినిమాల్లో నటించి.. అనుకోకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లింది. ఆర్తి అగర్వాల్ కెరీర్ నాశనం కావడానికి కారణం ఏంటో ఇఫ్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

2005, మార్చి 23న క్లీనింగ్ కెమికల్ త్రాగి ఆ**త్మ**హ**త్య  ప్రయత్నం చేసింది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో యువహీరో తరుణ్‌తో సంబంధం ఉన్నట్టుగా వస్తున్న వదంతులతో విసిగి ఆ పని చేసినట్టు ఆర్తీ చెప్పింది. 2006 ఫిబ్రవరి 15లో అనుమానాస్పద పరిస్థితుల్లో మెట్లపై నుండి జారిపడి ఆర్తి ఆసుపత్రి పాలైంది. 2007, నవంబరు 22 న ఆర్తీ రాణీగంజ్‌లోని ఆర్యసమాజంలో న్యూజెర్సీకి చెందిన గుజరాతీ ప్రవాసభారతీయుడు ఉజ్వల్‌ నికమ్ ను వివాహమాడింది. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తరువాత చివరికీ గత కొంతకాలంగా స్థూలకాయం, శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న ఆర్తీ చికిత్సకోసం అమెరికా వెళ్లి అక్కడే చికిత్స తీసుకున్నది. 2015 జూన్ 4న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ ఫెక్షన్ తలెత్తడంతో ఎగ్ హార్బర్ టౌన్ షిప్ లోని తన స్వగృహంలో అనూహ్యంగా జూన్ 6, 2015 న కన్ను మూసింది.

Advertisement

డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ హీరోగా నటించిన సినిమాలో  హీరోయిన్ గా నటించింది ఆర్తి అగర్వాల్.  ఆ సమయానికి ఫెయిల్యూర్ తో ఎవ్వరూ పట్టించుకోని దీన స్థితిలో ఉంది. ఆ టైమ్ లో డైరెక్టర్ అమ్మరాజశేఖర్ కి ఎలాంటి  పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల్లో పని చేశానని.. స్టార్ హీరోలతో కలిసి నటించానని తనను ఎలా దారుణంగా వాడుకున్నారో అమ్మ రాజశేఖర్ కి చెప్పి బోరున ఏడ్చేసిందట. ఆ సమయంలో మీకు మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పి.. రాజశేఖర్ ఆమెను ఓదార్చారట. ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు డైరెక్టర్ అమ్మ రాజశేఖర్.

Also Read : హనుమాన్ కంటే శ్రీ ఆంజనేయం బెటర్..? డైరెక్టర్ కృష్ణవంశీ ఏమన్నారంటే..?

Visitors Are Also Reading