Home » నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేశాడు

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేశాడు

by Bunty
Ad

టాలీవుడ్ లో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ వంటి హీరోలు చాలామంది నందమూరి కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోలుగా నిలిచారు. ఇక కొంతమంది నిర్మాతలు, వ్యాపారవేత్తలుగా ఎదిగారు. అయితే తాజాగా ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా వెండితెరకు పరిచయం కానున్నాడు. బసవతారకరామ క్రియేషన్స్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను నెలకొల్పిన ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.

READ ALSO : టి20 చరిత్రలో టీమిండియాకు అతిపెద్ద విజయం

Advertisement

గతంలో రక్ష, జక్కన్న వంటి సినిమాలను తెరకెక్కించిన వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు మార్చి 5న టైటిల్ ను ప్రకటిస్తామని మూవీ యూనిట్ తెలిపింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. కాగా 2003లో తెలుగులో రిలీజ్ అయిన ధమ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు నందమూరి చైతన్య కృష్ణ.

Advertisement

READ ALSO : Manchu Manoj : మోహన్ బాబు సమక్షంలో మంచు మనోజ్ పెళ్లి..ఇదిగో ఫోటోలు

జగపతిబాబు, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో చైతన్య కృష్ణ ఓ కీ రోల్ పోషించాడు. అయితే ఆ తర్వాత వ్యాపారంలో బిజీ అయిపోయారు. సుమారు 20 ఏళ్ల తర్వాత హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకుని గతేడాది మే లోనే ఈ సినిమాను ప్రకటించారు చైతన్య కృష్ణ. అయితే ఎందుకో కానీ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా టైటిల్ అప్డేట్ ను ప్రకటించారు.

READ ALSO : చాలా మంది వాహనాలపై వేసుకునే ఈ హనుమాన్‌ స్టిక్కర్‌ గురించి ఓ నిజం మీకు తెలుసా ?

Visitors Are Also Reading