Home » మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ.. అతను ఎవరో తెలుసా ?

మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ.. అతను ఎవరో తెలుసా ?

by Anji
Ad

సూపర్ స్టార్ మహేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. వీరి ఫ్యామిలీ నుంచే ఇప్పటికే చాలా మంది నటులు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇటీవలే కొద్ది రోజుల కిందటే మహేష్ ఫ్యామిలీ నుంచి గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం విధితమే. మహేష్ అక్క గల్లా పద్మావతి తనయుడు అశోక్ హీరో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ సినిమా పరవాలేదనిపించింది. ఇటీవలే రెండో మూవీని కూడా ప్రకటించాడు.

Advertisement

 

మహేష్ అల్లుడిగా గల్లా అశోక్ ఎంట్రీ ఇవ్వడంతో మహేష్ కూడా మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. మహేష్ అభిమానులు కూడా గల్లా అశోక్ కి సపోర్ట్ చేశారు. మహేష్ మరో అల్లుడు  ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గల్లా జయదేవ్-పద్మావతిల రెండో కుమారుడు, గల్లా అశోక్ తమ్ముడు సిద్దార్థ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతుకున్నట్టు సమాచారం. మరో వైపు అభిమానులు మాత్రం మహేష్ బాబు గురించి చాలా గొప్పగా పొగుడుతున్నారు. ఎంతో మంది పేదలకు మహేష్ బాబు ఆదుకుంటాడని.. అదేవిధంగా తన ఫ్యామిలీకి చెందిన వారు ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రోత్సహిస్తుంటారని ఇలా అందరి గురించి ఆలోచిస్తారని పేర్కొంటున్నారు అభిమానులు. 

Advertisement

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో కొత్త దర్శకుడు ఓ మూవీని తెరకెక్కిస్తాడని..  ఇందులో హీరోయిన్ గా శ్రీలీలను  తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయినట్టు సమాచారం.  దీంతో త్వరలోనే మహేష్ బాబు అల్లుడు సిద్దార్థ్ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తన పెద్ద అల్లుడికి మద్దతు ఇచ్చిన విధంగానే చిన్న అల్లుడికి కూడా మహేష్ మద్దతు ఇస్తాడని అందరూ భావిస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు ఫ్యామిలీ సిని ఇండస్ట్రీలోకి బాగానే ఎంట్రీ ఇస్తున్నారనే చెప్పవచ్చు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మరోసారి వివాదంలో చిక్కుకున్న నయనతార దంపతులు..! ఉమ్మడి ఆస్తులు కాజేసారంటూ వారిపై కేసు నమోదు

”బేబీ” సినిమా మీద నెటిజన్ చేసిన నెగిటివ్ కామెంట్ కి.. ఆనంద్ దేవరకొండ రియాక్షన్..!

Visitors Are Also Reading