Home » ”బేబీ” సినిమా మీద నెటిజన్ చేసిన నెగిటివ్ కామెంట్ కి.. ఆనంద్ దేవరకొండ రియాక్షన్..!

”బేబీ” సినిమా మీద నెటిజన్ చేసిన నెగిటివ్ కామెంట్ కి.. ఆనంద్ దేవరకొండ రియాక్షన్..!

by Sravya
Ad

త్వరలో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న బేబీ సినిమా మన ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య నటిస్తోంది. సాయి రాజేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుండి వచ్చిన’ ఓ రెండు ప్రేమ మేఘాలు’ పాట యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యింది. అలానే ఈ సినిమా పోస్టర్లు కూడా బాగా ఆకట్టుకున్నాయి దీంతో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకున్నారు.

Advertisement

శుక్రవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. దీంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి. ఈ సినిమా ట్రైలర్ లో డైలాగులు కూడా అందరిని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తో ఆనంద్ దేవరకొండ కి హిట్ వస్తుందని అంటున్నారు. అయితే తాజాగా ఈ మూవీ మీద నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.

ఈ సినిమా ట్రైలర్ ని చూసినప్పుడు స్కూల్ వయసులో హీరోయిన్ రంగు చాలా తక్కువ ఉంటుంది కాలేజీకి వెళ్లే సమయంలో చాలా తెల్లగా కలర్ ఫుల్ గా కనబడుతుంది. దీంతో ఓ ట్విట్టర్ యూజర్ ”ఫెయిర్ అండ్ లవ్లీ కూడా దాని పేరుని గ్లో అండ్ లవ్లీ కింద మార్చుకుంది. 2023లో తెల్లగా ఉండే వాళ్ళని గ్లామర్ గా చూపిస్తున్నారు. అటువంటి బేబీ సినిమాలను మేము ఇంకా ఇప్పటికీ కూడా చూస్తున్నాము.

Advertisement

యూట్యూబ్ షార్ట్స్ ని ఫీచర్ ఫిల్మ్ గా తీస్తే ఇలాగే జరుగుతుంది.” అంటూ కామెంట్ చేసాడు ఓ ట్విట్టర్ యూజర్. ఈ కామెంట్ మీద ఆనంద్ దేవరకొండ స్పందించాడు ”ఇది అవసరమైన కామెంట్ కాదు. అనవసరమైన కామెంట్. ఇలాంటి ఘాటు కామెంట్స్ చేయడానికి ముందు సినిమా చూస్తే బాగుంటుంది అని రిప్లై ఇచ్చాడు”. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ సినిమా జూలై 14న రిలీజ్ అవ్వనుంది.

Visitors Are Also Reading