Home » యాంక‌ర్ అనితా చౌద‌రికి బాల‌య్య అంత‌పెద్ద సాయం చేశారా..? ఏం చేశారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

యాంక‌ర్ అనితా చౌద‌రికి బాల‌య్య అంత‌పెద్ద సాయం చేశారా..? ఏం చేశారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by AJAY
Ad

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య చాలా కోపిష్టి అని ప‌క్క‌న సెల్ఫీ దిగినా ప‌ట్టుకుని కొడ‌తార‌ని చాలా మంది అనుకుంటారు. కొన్ని సార్లు బాల‌య్య అభిమానుల మీద చేయి చేసుకున్న వీడియోలు కూడా వైర‌ల్ అయ్యాయి. అయితే అభిమానులు మాత్రం తమ బాల‌య్య చేయి వేసినందుకు ఆనందంగా ఉంద‌ని చెబుతుంటారు. అంతే కాకుండా బాల‌య్య ది చిన్న‌పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం అని ఆయ‌న చాలా సాయం చేస్తార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతుంటారు.

Advertisement

కాగా తాజాగా యాంక‌ర్ అనిత బాల‌య్య గొప్ప‌త‌నం గురించి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అనిత నైన్టీస్ లో యాంకర్ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఎక్కువ‌గా ఈటీవీలో అనిత టీవీ షోలు చేశారు. అంతే కాకుండా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా అనిత చాలా సినిమాల‌లో న‌టించారు. కేవ‌లం సినిమాల‌లోనే కాకుండా చాలా సీరియ‌ల్స్ కూడా అనితా చౌద‌రి నటించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. శ్రీకాంత్ హీరోగా న‌టించిన ఓ సినిమా కోసం హీరోయిన్ గా అనితా చౌద‌రి ఆడిషన్స్ కూడా ఇచ్చారు.

Advertisement

ఆ ఆడిష‌న్స్ లో సెలెక్ట్ అయిన‌ప్ప‌టికీ రాజ‌మండ్రిలో ఎక్కువ రోజులు షూటింగ్ అని చెప్ప‌డంతో వ‌దులుకున్నారు. ఇదిలా ఉంటే ఓ ఇంట‌ర్వ్యూలో అనితా చౌద‌రి మాట్లాడుతూ….త‌న‌కు బాల‌య్య తో న‌టించే అవ‌కాశం అస్స‌లు రాలేద‌ని చెప్పారు. అయితే బాల‌య్య‌తో క‌లిసి న‌టించ‌క‌పోయినా ప‌రిచ‌యం లేక‌పోయినా ఆయ‌న త‌న‌కు సాయం చేశార‌ని చెప్పారు.

త‌న‌కు యాక్సిడెంట్ అయ్యి ఆస్ప‌త్రిలో చేరిన‌ప్పుడు త‌న స్నేహితురాలు బాల‌య్య వీరాభిమాని ఒక‌రు విష‌యం ఆయ‌న‌కు చెప్పార‌ని అన్నారు. దాంతో బాల‌య్య త‌న‌ను ఆస్ప‌త్రికి వ‌చ్చి మ‌రీ ప‌రామ‌ర్షించార‌ని చెప్పారు. ప‌రామ‌ర్షించి త‌న‌కు ఆర్థిక‌సాయం చేశార‌ని ఆనందం వ్యక్తం చేశారు. ఇక అనితా చౌద‌రి గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో ఈ వ్యాఖ్య‌లు చేయ‌గా ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి.

Visitors Are Also Reading