Home » జైలర్ ప్రొడ్యూసర్ నుండి అనిరుధ్‌కు సూపర్ గిఫ్ట్..!

జైలర్ ప్రొడ్యూసర్ నుండి అనిరుధ్‌కు సూపర్ గిఫ్ట్..!

by Sravya
Ad

రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. నెల్సన్ దిలీప్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు తెలుగుతో పాటుగా తమిళ్ లో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యి భారీ వసూళ్ళని రాబట్టింది. 700 కోట్ల రూపాయలని వసూలు చేసింది అంటే ఎంత గొప్ప విషయం కదా..? త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 7 నుండి ఈ సినిమా అందుబాటలో ఉంటుంది. ఈ సినిమా మంచి హిట్ అవడంతో ఈ సినిమా ప్రొడ్యూసర్ చిత్ర యూనిట్ కి బహుమతులను కూడా ఇస్తున్నారు.

Advertisement

Advertisement

రజనీకాంత్ కి ఒక కాస్ట్లీ కారుని గిఫ్ట్ గా ఇచ్చారు 100 కోట్ల రూపాయల చెక్ ని కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ కి కూడా ఒక కాస్ట్లీ కార్ ని ప్రొడ్యూసర్ గిఫ్ట్ గా ఇచ్చారు. తాజాగా మ్యూజిక్ తో అదరగొట్టిన అనిరుద్ కి కూడా ఒక కాస్ట్లీ కార్ ని కళానిధి మారన్ గిఫ్ట్ కింద ఇచ్చారు. మూడు కాస్ట్లీ కారులను చూపించి ఒకటి ఎంచుకోమన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Also read:

Visitors Are Also Reading