Telugu News » నా భ‌ర్త‌తో ఎన్నో గొడ‌వ‌లు జ‌రిగాయి…విడాకుల పై సుమ షాకింగ్ కామెంట్లు..!

నా భ‌ర్త‌తో ఎన్నో గొడ‌వ‌లు జ‌రిగాయి…విడాకుల పై సుమ షాకింగ్ కామెంట్లు..!

by AJAY MADDIBOINA

తెలుగులో టాప్ యాంక‌ర్ గా సుమ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోలు, ప్రీరిలీజ్ ఈవెంట్ లు ఇలా ఫుల్ బిజీగా ఉంటుంది. సుమ యాంక‌ర్ గా చేసిన క్యాష్, స్టార్ మ‌హిళ లాంటి షోలు టెలివిజన్ రంగంలోనే స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు సుమ లీడ్ రోల్ లో జ‌య‌మ్మ పంచాయితీ అనే సినిమా కూడా చేసింది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో ఫుల్ బిజీగా ఉంది.

Ads

ఈ నేప‌థ్యంలోనే సుమ ఆలీ చేస్తున్న ఆలీతో జాలీగా టాక్ షోకు హాజ‌రైంది. ఈ షోలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. సుమ రాజీవ్ క‌న‌కాల మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయని ఇద్ద‌రూ వేరు వేరుగా ఉంటున్నార‌ని వీరిద్ద‌రూ విడాకులు కూడా తీసుకుంటార‌ని కొంత కాలంగా మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఈ అంశంపై కూడా సుమ క‌న‌కాల స్పందించింది.

sumakanakala

sumakanakala

త‌న‌కు భ‌ర్త‌తో రాజీవ్ తో 23 ఏళ్ల వైవాహిక జీవితంలో ఈ మ‌ధ్య‌నే కొన్ని గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని చెప్పింది. అయితే భార్య‌, భ‌ర్త‌లుగా విడాకులు తీసుకోవ‌డం చాలా సుల‌భం అని కానీ త‌ల్లి దండ్రులుగా విడాకులు తీసుకోవ‌డం చాలా క‌ష్టమ‌ని చెబుతూ ఎమోష‌న‌ల్ అయ్యింది. అంతే కాకుండా త‌న‌కు చాలా సినిమాల‌లో అవ‌కాశాలు వ‌చ్చాయని కానీ ఓ మంచి సినిమా చేద్దామ‌నే వేచి చూశాన‌ని చెప్పింది. జ‌య‌మ్మ పంచాయితీ ఓ మంచి సినిమా అని తెలిపింది.

అంతే కాకుండా త‌న కొడుకు త్వ‌ర‌లోనే హీరోగా ప‌రిచ‌యం అవ్వ‌బోతున్నాడ‌ని కూడా క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా సుమ రాజీవ్ క‌న‌కాల విడిపోతున్నారు అంటూ చాలా కాలంగా వార్త‌లు వినిపించినా ఇద్ద‌రూ ఒక్క‌సారి కూడా పెద‌వి విప్ప‌లేదు. అయితే ఇప్పుడు సుమ చేసిన కామెంట్ల‌తో సినిమా ప్ర‌మోష‌న్స్ కోస‌మే ఇలా చేసిందంటూ కొంత‌మంది నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ALSO READ :

ఆచార్య “సిద్ద” రోల్ కోసం ఫస్ట్ ఆప్షన్ మహేష్ బాబు….కానీ ఎవరివల్ల తప్పుకున్నాడో తెలుసా…!

ప్ర‌భాస్ “ఆదిపురుష్” పై కేటీఆర్ కామెంట్ల వెన‌క అస‌లు కార‌ణం అదేనా..?


You may also like