Home » అనసూయ లేటెస్ట్ లుక్ వైరల్.. ఈ లుక్ ఎవరిది? అనసూయ ఇలా ఎందుకు కనిపిస్తోంది?

అనసూయ లేటెస్ట్ లుక్ వైరల్.. ఈ లుక్ ఎవరిది? అనసూయ ఇలా ఎందుకు కనిపిస్తోంది?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

రంగమ్మత్తగా, దాక్షాయణిగా, విమానం సినిమాలో సుమతి గా అనసూయ నిజంగానే ఇరగదీసింది. వ్యక్తిగత జీవితం, ఆమె పై ఉన్న విమర్శలను పక్కన పెడితే.. ఒక నటిగా అనసూయ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు. అవకాశం రావాలె కానీ, అనసూయ ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఇమిడిపోయి నటించి, మెప్పించగలరు అని పేరు తెచ్చుకున్నారు. ఇక సోషల్ మీడియాలో అనసూయకి ఉన్న క్రేజ్ గురించి కూడా చెప్పాల్సిన పని లేదు. ఆమె పెట్టె పోస్ట్ లు ఏ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయో అందరికి తెలిసిందే.

Advertisement

ప్రస్తుతం పుష్ప.. ది రూల్‌, తమిళ్‌లో ప్లాష్‌బ్యాక్ సినిమాలతో అనసూయ బిజీగా ఉంది. అయితే.. అనసూయ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆమె పెట్టిన ఫోటో క్షణాల్లో వైరల్ అయిపొయింది. అంతేకాదు నెటిజన్స్ కూడా ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి. రేపు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అనసూయ అన్‌సంగ్ హీరోయిన్ ఆఫ్‌ 1857, అవధ్‌ (యూపీ) ప్రాంత విప్లవ రాణి బేగం హజ్రత్‌ మహల్‌ గారి లుక్ ను రీక్రియెట్ చేసారు.

Advertisement

ఈ లుక్ తో ఉన్న ఫోటోనే ఆమె సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. హజ్రత్‌ మహల్‌ భారతదేశపు తొలి మహిళా స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరు. బ్రిటీష్ పాలనను ఛాలెంజ్ చేస్తూ ఆమె తన జీవితాన్ని రెండు దశాబ్దాల పాటు అంకితం చేసేసారు. మే 10 1984న ఆమె రూపంతో ఓ స్టాంప్ కూడా తీసుకొచ్చి.. ఆమెను ఎల్లకాలం గుర్తుంచుకునేలా భారతీయులు చేసుకున్నారు. వారి ధైర్యం, కమిట్‌మెంట్‌ ను మనంకూడా స్ఫూర్తిగా తీసుకుందాం అంటూ అనసూయ తన పోస్ట్ లో పేర్కొంది. ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

అనసూయ లేటెస్ట్ లుక్ వైరల్.. ఈ లుక్ ఎవరిది? అనసూయ ఇలా ఎందుకు కనిపిస్తోంది?

 Nani: నానిని తిట్టిపోస్తున్న టాలీవుడ్ ఆడియన్స్.. కారణం ఏంటంటే?

Visitors Are Also Reading