Home » మెగాస్టార్ భోళా శంకర్ నుంచి ఆసక్తికరమైన అప్డేట్ మీకోసం..!

మెగాస్టార్ భోళా శంకర్ నుంచి ఆసక్తికరమైన అప్డేట్ మీకోసం..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే వాల్తేరు వీరయ్య చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు బాబీ (కే.ఎస్. రవీంద్ర) తెరకెక్కించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంతో పాత చిరంజీవిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తాజాగా భోళా శంకర్ షెడ్యూల్ ఇవాళ ప్రారంభమైంది. 

Advertisement

హైదరాబాద్ నగరంలో కోల్ కతా బ్యాక్ డ్రాప్ సెట్ లో చిరంజీవితో పాటు దాదాపు 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఓ సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది.  ఈ పాటను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ చేస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ షెడ్యూల్ లో ఆమె కూడా జాయిన్ అయ్యారు. 

Also Read :   ప్రభాస్ నటించిన మిర్చి సినిమా ఎంత నిలబెట్టిందో తెలుసా ? 

దర్శకుడు మెహర్ రమేష్ చిరంజీవిని స్టైలిష్, మాస్ క్యారెక్టర్ లో ప్రస్తుతం చేస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. క్రియేటివ్ కమర్షియల్స్ తో కలిసి అనిల్ సుంకర ఎకే ఎంటర్టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీఓపీగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా.. తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్ గా, ఏ.ఎస్. ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2023 వేసవిలో రానున్న భోళా శంకర్ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి. 

Also Read :  ఏ హీరోలకు సాధ్యం కానీ రికార్డు నందమూరి హీరోలకే సాధ్యమైందా..?

Visitors Are Also Reading