కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తరువాత తొలిసారి ఉత్తరకొరియా చిగురుటాకులా వణుకుతోంది. మే నెల ప్రారంభం నుంచే అక్కడ విజృంభణ కొనసాగుతోంది. మూలిగే నక్కపై తాటి టెంక పడినట్టు కరోనాతో సతమతమవుతున్న నార్త్ కొరియాకు నూతన ముప్పు ముంచుకొస్తుంది. తాజాగా అంతుచిక్కని వ్యాధి భయాందోళనకు గురి చేస్తోంది. ఇక ఆగ్నేయ ఉత్తర కొరియాలోని రేవు నగరం హేజులో ప్రజలు అంతుచిక్కని అంటువ్యాధితో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు. పేగు సంబంధిత వ్యాధిగా అధికారులు అంచనా వేస్తున్నారు.
Advertisement
ఈ వ్యాధి బారిన పడిన రోగులకు అవసరమైన మందులను అందజేస్తున్నట్టు ఆ దేశ అధికార మీడియా వెల్లడించింది. ఇక అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుటుంబం కోసం నిలువ ఉంచి వ్యక్తిగత ఔషదాలను బాధితులకు అందజేయాలని సూచించినట్టు సమాచారం. బాధితుల సంఖ్య, వ్యాధి తీవ్రత గురించి మాత్రం బయటకు పొక్కనీయడం లేదు. ఇక కొత్త అంటు వ్యాధి తీవ్రతపై అస్పష్టత నెలకొన్నది. ఉత్తర కొరియా పత్రికా రోడాంగ్ సిన్మస్ సైతం కిమ్-అతని సతీమణి రిసోల్ జు తాము ఇస్తున్న ఔషదాలను పరిశీలిస్తున్న ఒక ఫోటోను ఫ్రంట్ పేజ్‌లో ప్రత్యేకంగా ప్రచురించింది.
Advertisement
ఇక ఈ అంతు చిక్క వ్యాధి టైఫాయిడ్, విరేచనాలు లేదా కలరా వంటి అంటువ్యాధిని సూచిస్తుంది. కలుషితమైన ఆహారం, నీరు, లేదా ఈ వ్యాధి సోకిన వ్యక్తుల మలం లేదా సంపర్కం ద్వారా సూక్ష్మక్రిముల వ్లల కలిగే పేరు అనారోగ్యం అని పేర్కొంటున్నారు. మంచినీటి శుద్ధి సౌకర్యాలు లేని ఉత్తర కొరియాలో ఇలాంటి వ్యాధులు సాధారణంగా సంభవిస్తుంటాయి. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలోనే అధిక సంఖ్యలో ప్రజలు జ్వరం లక్షణాలతో బాధపడుతున్నట్టు ఉత్తరకొరియా వెల్లడించింది. ఉత్తరకొరియాలో కొంత మంది ఈ వ్యాధిపై నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారని.. ఇక్కడ అంటు వ్యాది వ్యాప్తి చెందడం వాస్తవమేనని.. కిమ్ ప్రజల పట్ల తాను శ్రద్ధ వహిస్తున్నానని నొక్కి చెప్పడానికి ఉత్తర కొరియా ఓ అవకాశంగా వాడుకొంటుంది. ఉత్తర కొరియాలో ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించే DPRKHEALTH.ORG వెబ్‌సైట్ చీఫ్ హన్ క్యూంగ్ సూ వెల్లడించారు.
Also Read :
కార్ల వెనుక విండోస్‌పై ఆలైన్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?
Brahmastra Movie: బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర పేరిట సోషల్ మీడియాలో ట్రెండింగ్.. ఎందుకంటే..?