Home » కార్ల‌ వెనుక విండోస్‌పై ఆలైన్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

కార్ల‌ వెనుక విండోస్‌పై ఆలైన్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

by Anji
Ad

సాధార‌ణంగా టెక్నాల‌జీ రోజు రోజుకు వేగ‌వంతంగా పెరుగుతుంది. ముఖ్యంగా శాస్త్రవేత్త‌లు చిన్న చిన్న ఆవిష్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డంతోనే పెను మార్పులు సంభ‌విస్తున్నాయి. మాన‌వుడు పుట్టినప్ప‌టి నుంచి నేటి వ‌ర‌కు ఎన్నో త‌రాల్లో ఎన్నో మార్పులు సంభ‌వించాయి. తొలుత ఒక‌రాయిని మ‌రొక రాయితో రాపిడి చేసి నిప్పు ర‌వ్వ‌లు పుట్టించిన కాలం నేటి కంప్యూట‌ర్ కాలం వ‌ర‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చింది. టెక్నాల‌జీ అభివృద్ధి చెందుతున్న ఈ త‌రుణంలో మ‌న జీవితంలో మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే అంశాల‌ను మ‌నం చాలా విష‌యాల‌ను గ‌మ‌నించం. వాటిలో నైపుణ్య‌త ఎంత దాగి ఉన్న‌దో కూడా మ‌నం క‌నిపెట్ట‌లేము. అలాంటిదే ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా ఆ కోవ‌కు చెందిన‌దే. ఇక ఆల‌స్యం ఎందుకు అది ఏమిటో తెలుసుకుందాం.


సాధార‌ణంగా కారు విండోస్ పై వైప‌ర్ బ్లేడ్లు ఉంటాయి. వ‌ర్షం ప‌డిన స‌మ‌యంలో ఇవి ఉప‌యోగ‌ప‌డుతుంటాయి. వ‌ర్ష‌పు నీరు విండోస్‌పై ఎదురుగా వ‌స్తున్న వాహ‌నాలు క‌నిపించ‌కుండా ఉన్న స‌మ‌యంలో ఇవి నీటిని శుభ్రం చేస్తూ మార్గం స్ప‌ష్టంగా క‌నిపించేవిధంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దీని త‌రువాత దీనికి అడ్వాన్స్ టెక్నాల‌జీ ఏమిటంటే.. విండ్ షీల్డ్ లైన్స్ మీరు ఈ స‌న్న‌ని లైన్స్‌ను కారు వెనుక వైపు గ‌ల విండోస్ మీద గ‌మ‌నించే ఉంటారు. కానీ అవి ఎందుకు ఉంటాయ‌ని ఎప్పుడైనా మీరు ఆలోచించారా..? షో కోసమే అని మీరు అనుకుంటే పొర‌పాటు ప‌డ్డ‌ట్టే.

Advertisement

Advertisement

కారు వెనుక వైపు విండోస్ మీద ఉండే ఈ లైన్స్‌ను Defoggers అని పిలుస్తారు. ఇవి ఎల‌క్ట్రిక‌ల్ లైన్స్‌.. వీటి ద్వారా విద్యుత్ ప్ర‌వ‌హిస్తుంది. విండో గ్లాస్ వేడిగా అవుతుంది. దీనితో విండో మీద చేరిన తేమ మంచు తొలిగిపోయి స్ప‌ష్ట‌మైన వ్యూ మ‌న‌కు క‌నిపిస్తుంది. కారులో ఉన్న ఈ చిన్న లైన్స్ మీకు పెద్ద టెక్నాల‌జీగా అనిపించ‌క‌పోవ‌చ్చు. కానీ అవి ప్ర‌యాణికుల‌కు భ‌ధ్ర‌త‌, సౌక‌ర్యానికి వీలుగా ఉంటాయి. ఇక ఈ సారి మీరు లాంగ్ డ్రైవ్ వెళ్లిన‌ప్పుడు ఆ లైన్స్ ప‌ని త‌నాన్ని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించండి. ఏదైనా కార్ల త‌యారీ కంపెనీ ఇలాంటి చిన్న చిన్న విష‌యాల‌పై శ్ర‌ద్ధ చూపిస్తుందంటే ఎంతో గ‌ర్వించ‌ద‌గిన విష‌య‌మే.

Also Read : 

జ‌యం నుంచి ఉప్పెన వ‌ర‌కు తొలి మూవీతోనే హిట్ సాధించిన తెలుగు హీరోలు వీరే..!

స‌మంత‌, చైత‌న్య‌లాగే ఆ స్టార్ కపుల్ కూడా విడిపోనున్నారు ..! వేణుస్వామి కామెంట్స్ హాట్ టాపిక్..!

 

Visitors Are Also Reading