Home » చెట్టుపై ఉన్న ఈ ముగ్గురిలో ఒక స్టార్ హీరో ఉన్నారు..ఆయనేవరో గుర్తుపట్టగలరా..?

చెట్టుపై ఉన్న ఈ ముగ్గురిలో ఒక స్టార్ హీరో ఉన్నారు..ఆయనేవరో గుర్తుపట్టగలరా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఏ నటుడి కైనా స్టార్డం అనేది ఊరికనే రాదు.. దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఎంత డబ్బు ఉన్నా , సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ స్టార్డమ్ తెచ్చుకోవడం కష్టం.. అభిమానులను సంపాదించుకోవడం మరీ కష్టం.. మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలంటే నటనా టాలెంట్ తో పాటు అభిమానులను ఆదరించాలి.. అలాంటప్పుడే మనకంటూ ఒక స్టార్ హోదా కల్పిస్తారు.. తాజాగా ఒక సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ స్టార్ హీరో, ఈ చెట్టుపై ఎక్కిన ముగ్గురు చిన్నారుల్లో ఉన్నాడు..

Advertisement

also read;ఈ 10 మంది హీరోయిన్లు డ్యాన్స్ తో ఇండియన్ సినిమాని షేక్ చేసేశారు..!

Advertisement

ఈయన మలయాళం తో పాటు తెలుగులో కూడా మంచి హిట్ అందుకున్నాడు.. ఈ స్టార్ కిడ్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. ఈ చెట్టుపై ఉన్న ముగ్గురు పిల్లల్లో ఆ స్టార్ హీరో మధ్యలో ఉన్నాడు.. ఆ పోలికను చూసి మీరు కనిపెట్టేయండి.. కష్టమవుతోందా.. ఆ హీరో మనందరికీ తెలిసిన వ్యక్తి.. ఆయన ఎవరో కాదు సీతారామం మూవీతో అదరగొట్టిన మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్.

ఈయన తెలుగులో అనేక సినిమాలు చేశారు. మహానటి సినిమాలో దుల్కర్ సల్మాన్ జెమినీ గణేషన్ పాత్రలో నటించాడు. ఈమధ్య హను రాఘవపూడి డైరెక్షన్లో వచ్చిన సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read;ప్రభాస్ కి ఉన్న ఒకే ఒక బలహీనత అదే.. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్ శ్రీను..!!

Visitors Are Also Reading