Home » ప్రభాస్ సినిమా షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ కు ప్రమాదం!

ప్రభాస్ సినిమా షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ కు ప్రమాదం!

by Bunty
Ad

యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న మోస్ట్ అవేయిటెడ్ సినిమాల్లో ప్రాజెక్టు కే ఒకటి. అయితే తాజాగా మహాశివరాత్రి సందర్భంగా, ప్రాజెక్టుకే నిర్మాతలు సినిమా విడుదల తేదీని వెల్లడించారు. ప్రభాస్, దీపికా పదుకొనే మరియు అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం జనవరి 12, 2024న థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీతో పాటు పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు.

READ ALSO : వాహనదారులకు భారీ షాక్… ఇక రోడ్డెక్కితే బాదుడే, ఏప్రిల్ 1 నుంచి…!

Advertisement

ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రాజెక్ట్ కె నిర్మాతలు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా, బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు ప్రాజెక్ట్ కె షూటింగులో అనుకోని ప్రమాదం జరిగింది. ఆయనకు గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని హైదరాబాదులో ఏఐజి హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్సను అందించారు. ప్రస్తుతం అమితాబ్ ముంబైకి చేరుకున్నారు.

Advertisement

READ ALSO :  : Kabzaa Trailer : కబ్జా ట్రైలర్ రిలీజ్… కేజిఎఫ్ మూవీని మించిపోయిందిగా…!

ప్రాజెక్టుకే సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసి ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. దీంతో ఆయన అభిమానుల్లో తెలియని ఆందోళన నెలకొంది. తనకు ప్రమాదం జరిగిన విషయాన్ని అమితాబ్ తన బ్లాగ్ ద్వారా తెలియజేశారు. ప్రాజెక్టు కే షూటింగ్, యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగి అమితాబ్ కి గాయాలయ్యాయి ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

READ ALSO : Director Sagar Passed Away : టాలీవుడ్‌కు వరుస విషాదాలు.. సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత..

Visitors Are Also Reading