ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కి వచ్చిన సమయంలో పాన్ ఇండియా నటుడు జూనియర్ ఎన్టీఆర్ ని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక మరిచిపోకముందే మరి కొద్ది రోజులకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా హైదరాబాద్‌కి వచ్చి మరో నటుడు నితిన్ ని కలిశారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అమిత్‌షాని కలవడం పై సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
ఇది కూడా చదవండి : పుష్పలో విలన్ గా మరో టాలీవుడ్ హీరో..?
Advertisement
కొందరూ సినిమా కోసం అని, మరికొందరూ తమ పార్టీలో చేరమని ఆహ్వనించడానికి అని, ఇలా ఎవరికీ తోచింది వారు పలు కథనాలు రాశారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న విషయం ఏంటంటే.. త్వరలో నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోతున్న బై ఎలక్షన్ లో విజయం సాధించడం కోసం బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తోంది. ఇక ఈ నటులను కలవడం వెనుక అందులో ఉన్న రహస్య వ్యూహమే అని పలువురు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్‌ని అమిత్ షా కలిసినప్పటి నుంచి అయితే భారతీయ జనతా పార్టీ, అమిత్ షా, ఎన్టీఆర్ ఇలా అందరూ ట్రెండింగ్ లోనే ఉన్నారు.
Advertisement
ఇక పాజిటివ్, నెగిటివ్ అన్నది అనవసరం అని, పార్టీకి కావాల్సింది తమ పార్టీ పేరు తెలంగాణలో అందరికీ తెలియజేయడం కోసమే అని వారు ఈ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. వారి ప్లాన్ కూడా వర్క్ అవుట్ అయినట్టే ఎన్టీఆర్‌ని కలిసిన తరువాత ఆ పార్టీ పేరు వాస్తవానికి తెలంగాణలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో మారు మ్రోగుతుందని చెప్పవచ్చు. ముందు ముందు కొందరూ బీజేపీ నాయకులు హైదరాబాద్ వస్తారని.. క్రేజీ ఉన్న తెలుగు నటులను కలుస్తారని చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. మొన్నటివరకు టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందని అనుకుంటుంటే ఈ నటులను కలిసిన తరువాత బీజేపీ ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమించిందని పేర్కొంటున్నారు. ఇక ఈ ట్రెండ్ కొనసాగితే మాత్రం మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఈజీగా గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సారి మరీ ఏ నటులను కలుస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి : భోజనం చేసిన తరువాత ఎట్టి పరిస్థితిలో కూడా ఈ పనులు అస్సలు చేయకండి..!