Home » భోజ‌నం చేసిన త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలో కూడా ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి..!

భోజ‌నం చేసిన త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలో కూడా ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి..!

by Anji
Ad

ప్ర‌స్తుతం ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలా మంది ఆరోగ్యంపై శ్ర‌ద్ధ వ‌హించ‌రు. కొంత మందికి అయితే క‌నీసం తిన‌డానికి స‌మ‌యం ఉండ‌దు. మ‌రికొంద‌రూ మాత్రం ఫుడ్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు ప‌డుతూ స‌మయానికి తింటుంటారు. ఫుడ్ విష‌యం మాత్రమే హెల్త్ విష‌యంలో కూడా కొంద‌రూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. దాదాపు 60 శాతం మంది హెల్త్ విష‌యంలో అస్స‌లు జాగ్ర‌త్త వ‌హించ‌ర‌ని చెప్పాలి. ఆరోగ్యంప‌రంగా తెలిసి తెలియ‌ని పొర‌పాట్ల వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వీటి ప‌ట్ల చాలా జాగ్ర‌త్త‌గా ఉండ‌డం బెట‌ర్‌. ప్ర‌ధానంగా కొంద‌రూ తిన‌డానికి ముందు తిన్న త‌రువాత కొన్ని ర‌కాల ప‌నుల‌ను చేస్తుంటారు. తిన్న త‌రువాత తిన‌క ముందు కొన్ని ర‌కాల ప‌నులు చేయ‌డం వ‌ల్ల చాలా ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. తిన్న త‌రువాత ఎటువంటి ప‌నులు చేయ‌కూడ‌దో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


ముఖ్యంగా మ‌నం ఆరోగ్యాన్ని మ‌నం జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలంటే కొన్ని ర‌కాల ఆరోగ్య సూచ‌న‌ల‌ను పాటించాల్సిందే. భోజ‌నం చేసిన కొన్ని ప‌దార్థాల‌ను తిన‌కుండా ఉండ‌డం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డం, పొట్ట పెర‌గ‌డం వంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. భోజ‌నం చేయ‌డానికి ముందు లేదా భోజ‌నం చేసిన త‌రువాత పండ్లు ఎక్కువ‌గా తిన‌కూడ‌దు. తిన్న త‌రువాత పండ్లు ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల పొట్ట పెరిగే అవ‌కాశం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. అదేవిధంగా అన్నం తిన్న వెంట‌నే టీ కూడా తాగ‌కూడ‌దు. ఆ విధంగా చేయ‌డం వ‌ల్ల తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంస‌కృతుల‌ను శ‌రీరం ఉప‌యోగించుకోకుండా అడ్డుకుంటాయి. తిన్న వెంట‌నే స్నానం కూడా అస్స‌లు చేయ‌కూడ‌దు.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  లైగ‌ర్ ప‌రాజ‌యం కావ‌డానికి ద‌ర్శ‌కుడు సుకుమార్ కార‌ణ‌మా..?


తిన్న వెంట‌నే స్నానం చేయ‌డం వ‌ల్ల కాళ్లు, చేతుల్లోకి ర‌క్త ప్ర‌స‌ర‌ణ పెరుగుతుంది. అందువ‌ల్ల పొట్ట చుట్టూ ఉన్న ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ త‌గ్గి జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మంద‌గిస్తుంది. భోజ‌నం చేసిన త‌రువాత 10 నిమిషాల పాటు న‌డ‌క మంచిది అంటారు. కానీ అలా న‌డ‌వ‌డం వ‌ల్ల పోష‌కాల‌ను గ్ర‌హించ‌డంలో జీర్ణ‌వ్య‌వ‌స్థ విఫ‌లం చెందుతుంది. తిన్న వెంట‌నే కాకుండా 10 నిమిషాల త‌రువాత న‌డ‌వ‌డం మంచిది అని నిపుణులు పేర్కొంటున్నారు. అన్నింటికంటే ముఖ్య‌మైంది చాలా మంది తిన్న వెంట‌నే నిద్రిస్తుంటారు. అలా అస్స‌లు చేయ‌కూడ‌దు. తిన్న వెంట‌నే నిద్రించ‌డం వ‌ల్ల మ‌నం తిన్న ఆహారం జీర్ణం కాకుండా ఉంటుంది. దీంతో జీర్ణ స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

ఇది కూడా చ‌ద‌వండి :   న‌రాల బ‌ల‌హీన‌త‌తో బాధ‌ప‌డే వారికి ‘సీతాఫ‌లం’ గొప్ప ఔష‌దం..!

Visitors Are Also Reading