Home » Amigos Movie : “అమిగోస్” సినిమా ప్లస్ పాయింట్స్ ఇవే…కళ్యాణ్ రామ్ హిట్ కొట్టినట్టేనా?

Amigos Movie : “అమిగోస్” సినిమా ప్లస్ పాయింట్స్ ఇవే…కళ్యాణ్ రామ్ హిట్ కొట్టినట్టేనా?

by Bunty
Published: Last Updated on
Ad

 

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఆమిగోస్ సినిమా శుక్రవారం రోజు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను కొత్త దర్శకుడు రాజేంద్ర తెరపైకి తీసుకువచ్చాడు. మూడు విభిన్నమైన క్యారెక్టర్స్ తో మనుషులు పోలిన మనుషుల కాన్సెప్ట్ ఈ సినిమా కథను దర్శకుడు రాసుకున్నాడు. ఇక ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇప్పటికే ప్రత్యేకమైన షోలను వీక్షించిన కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై పాజిటివ్ గా స్పందించారు. కాగా అమిగోస్ సినిమాకు ప్లస్ మరియు మైనస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. క్లాస్ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతున్న మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అవుతోంది. ఫస్ట్ హాఫ్ తో పోల్చి చూస్తే సెకండ్ హాఫ్ బాగుండటం గమనార్హం. సరికొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు రాజేంద్రరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. కళ్యాణ్ రామ్ మాత్రం మూడు పాత్రలకు తాను పూర్తిస్థాయిలో న్యాయం చేశారనే చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. క్లాస్ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతున్న మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అవుతుంది. ఫస్ట్ హఫ్ తో పోల్చి చూస్తే సెకండ్ హాఫ్ బాగుండటం గమనార్హం.

Advertisement

నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కళ్యాణ్ రామ్ పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఆశిక రంగనాథ్ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. బ్రహ్మాజీ ఉన్న సన్నివేశాలు ఆసక్తికరంగా లేకపోవడం ఒకింత మైనస్ అయింది. కొన్ని సన్నివేశాలు ఊహలకు అనుగుణంగా ఉండటం గమనార్హం. బింబిసార సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ ఆ మ్యూజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి భారీ అంచనాలతో ఈ సినిమాకు వెళితే మాత్రం నిరాశ తప్పదని చెప్పవచ్చు.

READ ALSO : Waltair Veerayya : “వాల్తేరు వీరయ్య” ఓటిటి రిలీజ్ డేట్ పిక్స్..స్ట్రీమింగ్ ఎందులో అంటే !

Visitors Are Also Reading