Home » సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ నాగబాబు మాత్రం చేయడం లేదట.. ఎందుకో తెలుసా ? 

సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ నాగబాబు మాత్రం చేయడం లేదట.. ఎందుకో తెలుసా ? 

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాల్లో నటించాడు. ఇక ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. నటుడిగా సక్సెస్ కాలేకపోయిన నాగబాబుని చిరంజీవినే స్వయంగా నిర్మాతగా పరిచయం చేశాడు. నాగబాబు నిర్మాతగా చేసిన కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. నాగబాబు నటించాలనుకుంటే ఇప్పటికీ వరుసగా ఆఫర్లు వస్తాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యే అవకాశాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడు అయుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అన్నయ్య అయ్యిండి చిన్నా, చితక పాత్రలు చేస్తే బాగుండదంటున్నారు. 

Advertisement

నాగబాబు అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ స్టార్స్ అనే ఉద్దేశంతో వస్తున్న చాలా ఆఫర్స్ ని సున్నితంగా నాగబాబు తిరస్కరిస్తున్నాడనే ప్రచారం సినీ ఇండస్ట్రీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను నాగబాబు అలరించే విధంగా గతంలో సినిమాలు చేసాడు. అప్పట్లో చేసిన పాత్రలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి.  నాగబాబుతో ఇప్పటికీ సినిమాలు చేయడానికి కొందరూ ఫిలిం మేకర్స్ ఆసక్తి చూపించడం లేదు. అందుకు కారణమేంటంటే.. ఆయనకు తగిన పాత్రలను తాము క్రియేట్ చేయలేమని వారు భావిస్తున్నారు. 

Advertisement

Also Read :  Naga Shaurya : ఆకట్టుకుంటున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్!

అంతేకాదు.. నాగబాబు కొత్త సినిమాలు ప్రస్తుతానికి అయితే ఏమి లేవు. మరోవైపు జనసేన పార్టీ కీలక నేతగా వ్యవహరిస్తున్నాడు నాగబాబు. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసేది లేదంటూ తేల్చి చెప్పిన నాగబాబు సినిమాల విషయంలో మాత్రం  ఆసక్తి చూపించడం లేదని అర్థం అవుతోంది. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని నాగబాబు సినిమాలు చేయడం లేదని మెగా కంపౌండ్ నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ లో నాగబాబు నిర్మాతగా వరుస సినిమాలను నిర్మించే అవకాశాలున్నాయట.  

Also Read :   Pawan Kalyan: రెండోసారి దేవుడిగా చేయనున్న పవన్ కళ్యాణ్

Visitors Are Also Reading