Home » Naga Shaurya : ఆకట్టుకుంటున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్!

Naga Shaurya : ఆకట్టుకుంటున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్!

by Bunty
Ad

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరో నాగశౌర్య. మొదటి సినిమాతోనే నాగశౌర్య టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో లవర్ బాయ్ లుక్ లో కనిపించి అమ్మాయిల ఫేవరెట్ గా మారిపోయాడు. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇక నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ప్రముఖ నటుడు శ్రీనివాస్ అవసరాల చాలా రోజుల తర్వాత మెగా ఫోన్ పట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా చేసింది.

Advertisement

రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది. క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా సాగింది. నాగశౌర్య, మాళవిక నాయర్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్తున్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. కళ్యాణి మాలిక్ అందించిన సంగీతం అయితే సినిమాను మ్యూజికల్ రైడ్ కు తీసుకెళ్తుంది.

Advertisement

ఫ్రెండ్షిప్, లవ్ ను సమతూకంగా చూపించే ప్రయత్నం చేసినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. నాగశౌర్య సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా చేస్తోంది. శ్రీనివాస్ అవసరాల స్వీయ దర్శకత్వంతో పాటు కీలక పాత్ర పోషిస్తున్నారు. మేఘ చౌదరి,అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య, వారణాసి సౌమ్య, హరిణి రావు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస్ అవసరాల గతంలో ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద లాంటి రొమాంటిక్ సినిమాలకు దర్శకత్వం వహించి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా కూడా అదే కోవలో ఉన్నట్లు తెలుస్తోంది.

read also  : NTR “కొండవీటి సింహం”లో చిరును తప్పించి.. మోహన్ బాబుకు ఛాన్స్…దీనికి అసలు కారణం ఇదే!

Visitors Are Also Reading