Home » ALLURI MOVIE REVIW & RATING : అల్లూరి సినిమా రివ్యూ..! శ్రీవిష్ణుకు మాస్ హిట్ ప‌డిన‌ట్టేనా..?

ALLURI MOVIE REVIW & RATING : అల్లూరి సినిమా రివ్యూ..! శ్రీవిష్ణుకు మాస్ హిట్ ప‌డిన‌ట్టేనా..?

by AJAY
Ad

ప‌రిచ‌యం :

టాలీవుడ్లో ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే హీరోలు చాలా త‌క్కువ మంది ఉన్నారు. ఆ లిస్ట్ లో హీరో శ్రీవిష్ణు కూడా ఒకరు. విభిన్న క‌థ‌ల‌తో పాత్ర‌ల‌లో న‌టిస్తూ శ్రీవిష్ణు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటాడు. అందుకే ఏ హీరో ఫ్యాన్ అయినా శ్రీవిష్ణు సినిమాల‌ను ఇష్ట‌ప‌డుతుంటారు. ఇక శ్రీవిష్ణు హీరోగా న‌టించిన తాజా చిత్రం అల్లూరి. ఈ సినిమా టీజ‌ర్ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

Advertisement

ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ సందడి చేశారు. ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడీగా కాయ‌దు లోహ‌ర్ హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా సుమ‌న్, త‌నికెళ్ల భ‌ర‌ణి ముక్యమైన పాత్ర‌ల‌లో న‌టించారు. ప్ర‌దీప్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అంతే కాకుండా బెక్కెం వేణుగోపాల్ ల‌క్కీ మీడియా బ్యాన‌ర్ పై ఈ సినిమాను నిర్మించారు.ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా నేడు విడుద‌లై ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ సినిమా అనుకున్న‌మేర విజ‌యం సాధించిందా లేదా అన్న‌ది ఇప్పుడు చూద్దాం.

Advertisement

క‌థ :
అల్లూరి సీతారామారాజు వ్యక్తిగ‌త జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లే ఈ సినిమా క‌థ‌. సాధార‌ణంగా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వ‌చ్చాయి. అంతే కాకుండా అలా వ‌చ్చిన సినిమాలన్నీ ఒకేర‌కంగా ఉంటారు. ఈ సినిమా కూడా అలాంటిదే. అల్లూరి డ్యూటీ కోసం ప్రాంతాలు మారుతూ ఉంటాడు. వెళ్లిన ప్ర‌తిచోటా స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అలా వ‌స్తున్న స‌మ‌స్య‌ల‌ను ఎలా ఎదురుకున్నాడు..? అనేదే ఈ సినిమా క‌థ‌.

క‌థ‌నం :
ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ శ్రీవిష్ణు చాలా వ‌ర‌కు సాఫ్ట్ గా క‌నిపించే పాత్ర‌ల‌ల‌నో న‌టించాడు. కానీ మొద‌టిసారి మాస్ సినిమాతో ముందుకు వ‌చ్చాడు. అంతే కాకుండా త‌న పాత్ర‌కు శ్రీవిష్ణు వంద‌శాతం న్యాయం చేశాడు. సినిమాలో కొన్ని సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అంతే కాకుండా ఇప్ప‌టి వ‌ర‌కూ శ్రీవిష్ణు డిఫ‌రెంట్ సినిమాలు చేసినా ఇది మాత్రం ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా అనే చెప్పాలి. ఇక సినిమాలో హీరోయిన్ గ్లామ‌ర్ కే ప‌రిమితం అయ్యింది. ఇంట‌ర్వెల్ కు ముందు వ‌చ్చే సీన్లు ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. అంతే కాకుండా తనికెళ్ల భ‌ర‌ణి చెప్పే డైలాగులు కూడా బాగున్నాయి. సెకండాఫ్ కాస్త లాగ్ అయిన‌ప్ప‌టికీ సినిమాలోని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ మాస్ ఆడియ‌న్స్ ను మెప్పిస్తాయి. అంతే కాకుండా సినిమాటో గ్ర‌ఫీ కూడా ఆక‌ట్టుకునే విధంగా ఉంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే అల్లూరి రెగ్యుల‌ర్ సినిమా అయిన‌ప్ప‌టికీ సినిమాలోని సీన్లు శ్రీవిష్ణు ప‌ర్ఫామెన్స్ కోసం ఒక‌సారి థియేట‌ర్లలో చూడ‌వ‌చ్చు.

ALSO READ : సిగ్గులేని బతుకులు… అంటూ వైసీపీపై బాలయ్య పంచులు మామూలుగా వేయలేదుగా…!

Visitors Are Also Reading