Home » సిగ్గులేని బతుకులు… అంటూ వైసీపీపై బాలయ్య పంచులు మామూలుగా వేయలేదుగా…!

సిగ్గులేని బతుకులు… అంటూ వైసీపీపై బాలయ్య పంచులు మామూలుగా వేయలేదుగా…!

by AJAY
Ad

ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీ పేరు మారుస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ ఘటన ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు ఇప్పటికే స్పందించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు బాలయ్య కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు.

Advertisement

బాలయ్య ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. మార్చడానికి… తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని వ్యాఖ్యానించారు. ఓ సంస్కృతి… ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నుముక ఎన్టీఆర్ అంటూ పేర్కొన్నారు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్పోర్ట్ పేరు మార్చాడని కొడుకు గద్దెనెక్కి హెల్త్ యూనివర్సిటీ మారుస్తున్నాదని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు అంటూ తనదైన స్టైల్ లో హెచ్చరించారు.

Advertisement

అంతేకాకుండా పంచభూతాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అక్కడ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారని… పీతలు ఉన్నారు అని విశ్వాసం లేని వాళ్ళని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి అంటూ బాలయ్య ఘాటుగా వ్యాఖ్యానించారు. శునకాల ముందు తలవంచుకు తిరిగే సిగ్గులేని బతుకులు అంటూ ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై టిడిపి తో సహా ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి.

Visitors Are Also Reading