Home » అల్లు అర‌వింద్ స‌తీమ‌ణి కండీష‌న్ మామూలుగా లేదుగా.. అది ఒప్పుకున్నందుకే బ‌న్నితో స్నేహా పెళ్లి జ‌రిగిందా..?

అల్లు అర‌వింద్ స‌తీమ‌ణి కండీష‌న్ మామూలుగా లేదుగా.. అది ఒప్పుకున్నందుకే బ‌న్నితో స్నేహా పెళ్లి జ‌రిగిందా..?

by Anji
Ad

టాలీవుడ్ మోస్ట్ క్యూట్ క‌పుల్స్‌లో అల్లు అర్జున్ సేహారెడ్డి ఒక‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎప్పుడు వీరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటుంది. బ‌న్నీ సినిమాల ద్వారా ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోష‌ల్ మీడియాలో ఫ్యాష‌న్ ఐకాన్‌గా అవ‌త‌రించి మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ని సొంతం చేసుకుంది. స్నేహారెడ్డికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 8.3 మిలియ‌న్ కి పైగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అల్లుఅర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విధిత‌మే.

Advertisement

2011లో వీరి పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ముఖ్యంగా సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ బ‌న్నీ మాత్రం ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్య‌త ఇస్తాడు. ఇటీవ‌లే బ‌న్నీ పై ఆయ‌న మామ తెగ ప్ర‌శంస‌లు కురిపించాడు. అల్లుడిగా బ‌న్నీకి 100కి 100 మార్కులు వేస్తాన‌ని చెప్పుకొచ్చాడు. ఇక అల్లుడు అల్లుఅర్జున్ ఐకాన్ స్టార్‌గా ఎద‌గ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని తెలిపారు. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బ‌న్నీకి బ‌య‌ట కూడా ఎంతో అభిమానులున్నార‌ని, చిరంజీవి అడుగుజాడ‌లో బ‌న్నీ ఎంతో క‌ష్ట‌ప‌డ‌తార‌ని చెప్పుకొచ్చారు. ఆ సంద‌ర్భంలో ఓ మీడియా ప్ర‌తినిధి క‌ట్నం గురించి ప్ర‌శ్నించ‌గా వాళ్ల‌కే చాలా ఎక్కువ ఆస్తి ఉంద‌ని, మ‌నం ఇచ్చేది వాళ్ల‌కి లెక్క కూడా కాదు అని, క‌ట్నాల‌కు వాళ్లు వ్య‌తిరేకం అని చెప్పారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  మోహ‌న్‌బాబు మొద‌టి భార్య గురించి ఎవ‌రికీ తెలియ‌ని ర‌హ‌స్యం ఇదే..!

ఇది ఇలా ఉంటే.. స్నేహ‌కి అల్లు అర‌వింద్ భార్య నిర్మ‌ల పెళ్లికి ముందే ఓ కండిష‌న్ పెట్టింద‌ట‌. ఆమె కండిష‌న్ స్నేహ యాక్సెప్ట్ చేయ‌గానే ఆమె కూడా పెళ్లికి ఓకే చేసిన‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతోంది. ఆమె పెట్టింన కండీష‌న్ ఏంటో కాదండోయ్‌.. పెళ్లి జ‌రిగిన త‌రువాత త‌న కొడుకుని హ్యాపీగా చూసుకోవ‌డంతో పాటు పిల్ల‌లను క‌ని వారి ఆల‌నా పాల‌నా చూసుకోవాల‌ని చెప్పింద‌ట‌. అత్త‌గారు చెప్పిన విధంగా కోడ‌లు కూడా న‌డుచుకుంటుంది. తొలుత ఒక కొడుకుని, ఆ త‌రువాత ఓ పాప‌కి జ‌న్మ‌నిచ్చింది స్నేహ‌. దీంతో అల్లు నిర్మ‌ల చాలా సంతోష ప‌డింద‌ట‌. ఇక అల్లు ఫ్యామిలీలో ఏదైనా వేడుక జ‌రిగిందంటే వారి పిల్ల‌ల‌తో చాలా సంద‌డిగా ఉంటుంది. మొత్తానికి అత్త కండిష‌న్‌ని యాక్సెప్ట్ చేసి మంచి కోడ‌లు అనిపించుకుంది అల్లు స్నేహ‌.

ఇది కూడా చ‌ద‌వండి :  మహేష్ బాబు “బిజినెస్ మ్యాన్” సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా….? ఆ ఒక్క కారణంతోనే…!

Visitors Are Also Reading