Home » పొరపాటున కూడా ఈ వస్తువులు రైల్లో తీసుకువెళ్ళకూడదు.. పట్టుబడ్డారో జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే..!

పొరపాటున కూడా ఈ వస్తువులు రైల్లో తీసుకువెళ్ళకూడదు.. పట్టుబడ్డారో జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే..!

by Bunty
Ad

సాధారణంగా మనం దూర ప్రయాణాలు చేయాలంటే ముఖ్యంగా ఎంచుకునేది రైలు మాత్రమే. ఎందుకంటే రైలులో రవాణా చార్జెస్ చాలా తక్కువగా ఉంటాయి మరియు కంఫర్ట్ గా ఉంటుంది. కాబట్టి సాధారణ ప్రజల నుంచి ధనవంతుల వరకు ఈ రైల్ లోనే ప్రయాణిస్తుంటారు.

Advertisement

అలాగే దూర ప్రయాణాలు చేయాలంటే ముందుగా సీట్లను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రైలు ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని వస్తువులను మనం తీసుకొని పోకూడదు. ఒకవేళ అలా చేస్తే జరిమానా పడే ఛాన్స్ ఉంటుంది. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

# యాసిడ్ బాటిల్స్:

రైలులో యాసిడ్ బాటిల్ తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం. ఒకవేళ ప్రయాణికుడు ఇలా చేసి పట్టుబడితే రైల్వే చట్టంలోని సెక్షన్ 164 కింద అతడిని వెంటనే అరెస్టు చేయవచ్చు. ఈ సెక్షన్ కింద యాసిడ్ బాటిల్ తీసుకువెళ్లినందుకు రూ. 1000 జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు.

Advertisement

# గ్యాస్ సిలిండర్:

ఇతర ప్రాంతాలలో పనిచేసేవారు ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తమతో పాటు గ్యాస్ స్టవ్ లు లేదా సిలిండర్లు తీసుకువస్తుంటారు. ఇలా రైలులో గ్యాస్ సిలిండర్లు, స్టవ్ లు తీసుకు వెళ్లడం రైల్వే చట్టం ప్రకారం చట్టవిరుద్ధం. నిండుగా ఉన్న సిలిండర్ దొరికితే జైలు శిక్ష లేదా కఠినమైన జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

# క్రాకర్స్:

రైళ్లలో పటాకులు తీసుకువెళ్లడం పూర్తిగా నిషేధించబడింది. ఎవరైనా రైలులో పటాకులు తీసుకువెళ్తుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. అతనికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు.

# ఆయుధాలు:

రైలులో లైసెన్స్ పొందిన ఆయుధాలు తప్ప కత్తి, ఈటె, రై*ఫిల్ ఇలా ఇతర ప్రాణాంతక ఆయుధాలను తీసుకువెళ్లకూడదు. ఇలా చేయడం వల్ల రైల్వే చట్టం, ఆయుధ చట్టం కింద మీపై కేసు నమోదు చేస్తారు.

READ ALSO : చంద్రబాబుకు జగన్ షాక్..ఏపీలో సభలు, ర్యాలీలు నిషేధం

Visitors Are Also Reading