Home » హిందీ సినిమాలు అందుకే ప్లాప్ అవుతున్నాయి అంటున్న అక్షయ్…!

హిందీ సినిమాలు అందుకే ప్లాప్ అవుతున్నాయి అంటున్న అక్షయ్…!

by Azhar
Ad

ప్రస్తుతం ఇప్పుడు ఇండియన్ సినిమా రంగంలో మొత్తం సౌత్ సినిమాలు మరి ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలు ఏలుతున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కపుడు హిందీలో మన సౌత్ సినిమాలకు అంతగా ఆదరణ అనేది ఉండేది కాదు. ఎప్పుడో ఒక్కసారి తమిళ్ సినిమాలు హిందీలో విడుదల అయినా మన సినిమాలు అంటే ఎప్పుడు వారికీ చిన్నచూపే ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. మన సౌత్ సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం ఈ మధ్య అక్కడ మన సౌత్ సినిమాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అని చెప్పాలి. బాహుబలి తర్వాత ప్రతి ఏడాది ఒక్క సౌత్ సినిమా అనేది అక్కడ విడుదల అయ్యి హిట్ కొడుతూ వస్తుంది.

Advertisement

ఇక ఈ సౌత్ సినిమాల దెబ్బకు హిందీ సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. మన సినిమాలు విడుదల సమయంలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే ఆంధీ షెడ్ కు వెళ్ళిపోతుంది. ఇక ఈ మధ్య కాలంలో మన సినిమాలు వరుసగా హిట్ కావడంతో.. ఎందుకు హిందీ సినిమాలు ప్లాప్ అవుతున్నాయి.. సౌత్ సినిమాలు హిట్ అవుతున్నాయి అనే ప్రశ్నకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సమాధానం ఇచ్చారు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు సమంతతో కలిసి వచ్చిన అక్షయ్ మన సినిమాలను ఆకాశానికి ఎత్తేసారు.

Advertisement

అక్షయ్ కుమార్ మాట్లాడుతూ… మన హిందీలో మల్టి స్టారర్ సినిమాలు అనే వి చేయడానికి అందరూ భయపడుతున్నాయి. ఎంత పెద్ద హీరో అయినా సరే మల్టి స్టారర్ సినిమా అనగానే కథ కూడా వినకుండా నో చెబుతున్నాడు. నేను కూడా ఒక మల్టి స్టారర్ సినిమాను నిర్మించాలని అనుకున్నాను. కానీ ఎవరు ఒప్పుకోలేదు. ఫలితం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఎవరు చేయడం లేదు. కానీ సౌత్ లో అలా కాదు. మంచి కథ ఉంటె ఏ హీరో అయినా సరే మల్టి స్టారర్ సినిమా చేయడానికి వెనకడుగు వేయడం లేదు. అందుకే ఆ సినిమాలు హిట్ అవుతున్నాయి. ఇక మన సినిమాలు సోలో హీరోగా.. అవి కూడా రొటీన్ గా ఉండటం వల్ల ప్లాప్ అవుతున్నాయి అని అక్షయ్ కుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి :

ఇండియాకు షాక్.. డోప్ టెస్టులో దొరికిపోయిన మహిళా అథ్లెట్లు..!

మహిళా బౌలర్ తో కేఎల్ రాహుల్..!

Visitors Are Also Reading