టాలీవుడ్ సీని పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. దాదాపు 6 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన అక్కినేని కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకీ వచ్చారు. వారిలో కొందరూ సక్సెస్ సాధిస్తే.. మరికొందరూ సక్సెస్ సాధించలేదనే చెప్పవచ్చు. సక్సెస్ సాధించిన తొలితరం కథానాయకులు అక్కినేని నాగేశ్వరరావు అయితే.. రెండవ తరం అక్కినేని నాగార్జున, మూడవ తరం హీరోలుగా నాగచైతన్య, అఖిల్. ప్రస్తుతం నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సక్సెస్ ఫుల్ హీరోలుగా నటిస్తూ అక్కినేని కుటుంబం పేరు నిలబెడుతున్నారు.
ఇది కూడా చదవండి : ఎన్టీఆర్‌ని కలవడం వల్ల బీజేపీకి కొలిసొచ్చిందట.. ఎలాగో తెలుసా..?
Advertisement
ముఖ్యంగా అక్కినేని వారసుడిగా నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే దాదాపు 40 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్నాడు. నాగార్జున వివాదాల జోలికి అసలు వెళ్లడు. కూల్ అండ్ కామ్‌గా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అప్పట్లో నాగార్జున పెళ్లి విషయంపై పెద్ద దుమారమే రేపింది. దగ్గుబాటి ఆడపడచుని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చేశారు. కారణాలు ఏవైనా కానీ అప్పట్లో నాగార్జున చేసిన పని అందరికీ కోపం తెప్పించిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా నాగేశ్వరరావుకి నాగార్జునకి అమల విషయంలో గొడవలు జరిగేవట. అలాంటివి ఏవి బయటకి రాకుండానే నాగేశ్వరరావు అమలతో నాగార్జున పెళ్లి చేశాడు.
Advertisement
ఇది కూడా చదవండి : “లైగర్” సినిమా కోసం మైక్ టైసన్ అన్ని కోట్లు తీసుకున్నాడా..? స్టార్ హీరోలకు మించి..?
ఇలా అమల ఓ రోజు నాగేశ్వరరావుతో ఇలా మాట్లాడిందట. మీ మనస్సు బాధపెట్టి ఉంటే నన్ను క్షమించడండి. మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం తప్ప వేరే అమ్మాయి జీవితం నాశనం చేయాలనుకోలేదు. మా తండ్రి ఎలాగో మీరు కూడా అంతే అని ఆయన పాదాలకు నమస్కరించిందట. అమలను తప్పగా భావించిన నాగేశ్వరరావు ఏడ్చేశారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. నాగార్జున తొలుత దివంగత నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మీని వివాహం చేసుకున్నాడు. వారికి సంతానంగా నాగచైతన్య పుట్టాడు. ఇక లక్ష్మీ నాగార్జున మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో వారు విడాకులు తీసుకున్నారు. ఇక నాగార్జున హీరోయిన్‌గా ఉన్న అమలను మరోసారి పెళ్లి చేసుకున్నాడు.
ఇది కూడా చదవండి : ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన యాంకర్ నే పెళ్లి చేసుకున్న బిచ్చగాడు హీరో…అతడి జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా..?