అక్కినేని నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలోకి నాగచైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చారు. నాగచైతన్య కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాప్ లతో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. కానీ అక్కినేని అఖిల్ కి మాత్రం ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా దక్కలేదు. అయినప్పటికీ ఆయనకి క్రేజ్ మాత్రం బాగానే ఉంది. అఖిల్ క్రేజ్ ఉండడానికి ప్రధాన కారణం చాలా అందంగా కనిపించడం, మరోవైపు క్రికెట్ కూాడా చాలా అద్భుతంగా ఆడుతాడు. దీంతో అభిమానుల మన్ననలు పొందుతున్నారు. మనం సినిమాలో అఖిల్ ఎంట్రీకి అందరూ టాలీవుడ్ కి మరో మహేష్ బాబు వచ్చేశాడు అని భారీ హైప్ క్రియేట్ చేశారు.
Also Read : శోభన్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. ఇప్పటి తరం హీరోలు కూడా అందుకోలేరు..!!
Advertisement
అక్కినేని అఖిల్ నటించిన తొలి సినిమా అఖిల్ అట్టర్ ఫ్లాప్ అయింది. రెండో సినిమా హలో యావరేజీగా నడిచింది. మూడో సినిమా విస్టర్ మజ్ను కూడా డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రం మాత్రం కమర్షియల్ కాస్త పర్వాలేదనిపించింది. అఖిల్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏజెంట్ చిత్రంతో వాళ్ల ఎదురు చూపులకు తెరపడిందని ఆశిస్తున్నారు. అఖిల్ కి నటన కంటే క్రికెట్ లో చాలా ఎక్కువ టాలెంట్ ఉంది. ఇండయన్ క్రికెట్ టీమ్ కి సెలెక్ట్ అయ్యేందుకు అన్ని అర్హతలున్న వ్యక్తి. కానీ క్రికెట్ వైపు కాకుండా సినిమాల వైపు వచ్చాడు ఎందుకో మరి.
Advertisement
తాజాగా సీసీపీఎల్ టోర్నమెంట్ లో తెలుగు వారియర్స్ తరపున ఆడుతున్నాడు అఖిల్. మెరపు షాట్స్ తో అద్భుతమైన ఇన్నింగ్స్ కొనసాగిస్తూ.. అభిమానులను ఫిదా చేస్తున్నాడు. ఇక టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రణవి మనుకొండ అఖిల్ ఇన్నింగ్స్ ఆడుతున్నంత సేపు ఓ రేంజ్ లో చీర్ అప్ చేసింది. ఇక ఆమెలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే.. అఖిల్ లవర్ కన్నా ఎక్కువ ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. ఆమెకు సంబంధించిన వీడియోలు చూసిన అక్కినేని అభిమానులు మా వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అంటూ సోషల్ మీడియాలో ఆమెను ట్యాగ్ చేస్తూ పలు పోస్టులు పెడుతున్నారు. ఈ కామెంట్స్ పై ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Also Read : పొలిటికల్ ఎంట్రీ కోసమే మనోజ్ పెళ్లి చేసుకున్నారా..? కౌంటర్ మామూలుగా లేదుగా..!