అక్కినేని కుటుంబానికి ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉన్నదో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏఎన్నార్ తరువాత నాగార్జున, నాగచైతన్య,అఖిల్, సుశాంత్, సుమంత్ హీరోలుగా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. తాజాగా అక్కినేని కుటుంబం అంతా ఒకే ప్రేమ్‌లో కనిపించి కనువిందు చేయడం విశేషం. ఇదిలా ఉండగా టాలీవుడ్‌లో కొద్ది రోజుల పాటు ప్రేమాయణం కొనగించిన జంట సమంత-నాగచైతన్య వివాహ బందానికి విడాకులు తీసుకోకున్నట్టు ప్రకటించిన విషయం విధితమే. ఈ జంట విడాకులు ప్రకటించినప్పటి నుంచి వీరి మధ్య ఎవేవో పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీరు వ్యక్తిగత విషయాలపై ఎన్నో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
ఇటీవలే అక్కినేని నాగార్జున ఇంట్లో నిర్వహించిన గెట్ టూ గెదర్ పార్టీలో అక్కినేని వారసులందరూ ఒకే చోట ఇలా కనిపించారు. ఈ ఫోటోలను హీరో సుశాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. క్షణాల్లో ఆ ఫోటో ఎంతో వైరల్‌గా మారింది. అయితే ఇందులో అఖిల్ మాత్రం మిస్ అయ్యాడు. మాల్దీవులకు వెళ్లిన అఖిల్ ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.
Advertisement
Advertisement
ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు సమంతను మిస్ అవుతున్నామంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్యతో పెళ్లి తరువాత అక్కినేని ఫ్యామిలీ వేడుకలలో సమంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచేది. కానీ విడాకుల నేపథ్యంలో సమంత దూరం అవ్వడం కొంత మంది అభిమానులను నిరాశ పరుస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవలే నాగార్జున వీరిద్దరినీ కలిపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం సమంత తండ్రిని కూడా కలిసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
— Sushanth A (@iamSushanthA) May 16, 2022
Also Read :
ఆషాఢమాసం లో భార్య భర్తలు ఎందుకు కలుసుకోవద్దు..? కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా…!
సమంత -నాగచైతన్యలను నాగార్జున కలుపబోతున్నాడా..?