Home » ఆషాఢమాసం లో భార్య భర్తలు ఎందుకు కలుసుకోవద్దు..? కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా…!

ఆషాఢమాసం లో భార్య భర్తలు ఎందుకు కలుసుకోవద్దు..? కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా…!

by AJAY

మనదేశం ఎన్నో సాంప్రదాయాలు..ఆచారాలు ఉంటాయి. సాంప్రదాయాలు..ఆచారాలు మంచివా చెడ్డవా అనే విషయానికి వస్తే అన్నింటిలో ఉన్నట్టుగానే వీటిలో కూడా మంచి చెడూ రెండూ ఉన్నాయి. ఉదాహరణకు పీరియడ్స్ లో ఉన్న ఆడపిల్లలని ఒకప్పుడు ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. అంతే కాదు పీరియడ్స్ ఉన్నన్ని రోజులు వాళ్ళు వేరే గదిలో లేదంటే బయటనే ఉండాలి. కాబట్టి ఈ ఆచారం మంచిది కాదు.

భర్త చనిపోయిన స్త్రీ బొట్టు పెట్టుకోక పోవడం, అలంకరణ కు దూరంగా ఉండాలనే నిబంధన కూడా మంచిది కాదు. కాబట్టి ఇలాంటివి పట్టించుకోక పోవడమే బెటర్. ఇక సెవంత్ సెన్స్ సినిమాలో హీరో సూర్య మన సాంప్రదాయాల్లో ఉండే కొన్ని గొప్ప విషయాలను చెబుతాడు. కడప కి పసుపు రాయడం వల్ల ఇంట్లోకి బాక్టీరియా రాదని…అదే విధంగా వాకిట్లో ముగ్గు వేయడం అనేది పిచ్చుకలకు ఆహారం అని అంటాడు.

గుమ్మానికి మామిడాకులు కట్టడం వల్ల ఆక్సిజన్ లభిస్తుందని ఇవి మన సాంప్రదాయం వెనక ఉన్న సైన్స్ అని అంటాడు. ఇప్పుడు మనం మన దేశంలోని మరో ఆచారం గురించి తెలుసుకుందాం. పెళ్ళైన తరవాత మనదేశంలో ఆషాఢమాసం లో భార్య భర్తలు కలవకూడదు అని చెబుతుంటారు. దీని వెనక కూడా ఓ సైన్స్ ఉందట. భార్య భర్తలు ఆషాఢ మాసంలో కలిస్తే వాళ్లకు వేసవిలో పిల్లలు పుట్టే అవకాశం ఉందట. దాని వల్ల ప్రసవించే తల్లి ,పుట్టే బిడ్డ ఇద్దరూ ఎండల వేడికి తట్టుకోలేరు. అందుకే ఆషాఢమాసం లో కలవకుడదు అని అంటారు.

ఇక మన వాళ్ళు చెప్పేది ఏంటంటే….ఆషాఢమాసం లో కోడలు అత్త ముఖం చూడవద్దట….అంతే కాకుండా అల్లుడు కూడా తన అత్త ముఖం చూడకూడదు అట. మరి కొందరు చెప్పేది ఏంటంటే…ఆషాఢమాసంలో అత్తా కోడళ్ళు ఓకే గుమ్మాన్ని దాట కూడదట. ఇక ఈ రీజన్ చెబితే పెళ్ళైన వెంటనే భార్య భర్తలు సెపరేట్ కాపురం పెట్టేస్తున్నారు. అలా అయితే అత్త పోరు ఉండదు…. ఆషాడం లోనూ కలుసుకోవచ్చు.

Also read :

మీ భార్య లో 5 లక్షణాలు ఉంటే మీరు అదృష్టవంతులే.! మరి ఉన్నాయో లేదో చూడండి..?

మోహన్ బాబు మొదటి భార్య ఎవరో తెలుసా…? ఆమె ఎలా చనిపోయారంటే…!

Visitors Are Also Reading